Sorry, you need to enable JavaScript to visit this website.

మరులు గొలిపే పూల మనోహరం

Read time: 1 నిమిషం

వింత వింత అలంకరణలు, చైతన్య పూరితమైన రంగులు, అద్భుతమైన సువాసనలు – పువ్వులు, పరాగ సంపర్కం కోసం ఎంపిక అమరికలను అందిస్తాయి. వాస్తవానికి, తేనెటీగలు, సీతాకోక చిలుకలు మరియు ఇతర పరాగసంపర్క కీటకాలు తాము సందర్శించే పువ్వులలో ప్రత్యేక ప్రాధాన్యతలను ఎంచుకుంటాయి  అని అధ్యయనాలు చూపిస్తున్నాయి. అంతేకాదు మారుతున్న వాతావరణానికి అనుగుణంగా తమ అభిరుచులను కూడా సర్దుబాటు చేసుకుంటాయి.

భారతదేశం అంతటా విస్తృతంగా కనిపించే సాధారణ వలస (ఆడ) సీతాకోకచిలుక పసుపు రంగుకు సహజమైన మొగ్గు చూపిస్తాయి అని పరిశోధకులు కనుగొన్నారు, అయితే అదే జాతికి చెందిన మగ సీతాకోక చిలుకలు నీలం మరియు పసుపు రెండింటినీ ఇష్టపడతాయి. కొంత వరకు, సీతాకోక చిలుకలకు వాటి రంగు ప్రాధాన్యతలను మార్చే ప్రయత్నాలు నేర్పించవచ్చు.  వాసన కూడా ఒక ముఖ్యమైన నిర్ణయాత్మక అంశం, మరియు తగినంత ఆకర్షణీయమైన సువాసన, సీతాకోక చిలుకలు సంపాదించిన రంగు ప్రాధాన్యతలను సమూలంగా మార్చగలదు.

పువ్వులు కూడా ఎక్కువ పరాగ సంపర్కాలను ఆకర్షించడానికి వాటి లక్షణాలను మార్చుకుంటూ ఉంటాయి. హిమాలయాల దిగువ కొండల్లోని రోడోడెండ్రాన్‌ లకు (ముద్ద గన్నేరుకు సంబంధించిన పూజాతి) పొడవైన పువ్వులు ఉంటాయి మరియు వాటి పూదేనె పల్చగా ఉంటుంది; అదే ఎక్కువ ఎత్తులో ఉన్న మొక్కలు తమలో తాము మార్పు తెచ్చుకుని, చిన్న పువ్వుల్లో  దిట్టమైన పూదేన కలిగి ఉంటాయ. ఇవి ఎక్కువ ఈగలు మరియు తుమ్మెదలను ఆకర్షిస్తాయి.

వాతావరణ మార్పులకు ప్రతిస్పందనగా వర్ణ విధాన (పిగ్మెంటేషన్‌) మార్పిడి ద్వారా కొన్ని పువ్వులు వాటి రంగులు మారుస్తున్నాయని ఇటీవల పరిశోధకులు కనుగొన్నారు. పరాగ సంపర్కాలు అటువంటి పువ్వులను పూర్తిగా ఉపేక్షించవచ్చు అని కొందరు శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. మొక్క మరియు– పరాగ సంపర్క కీటకం యొక్క పరస్పర చర్యల గురించి మెరుగైన అవగాహన మాత్రమే మనకు ప్రపంచంలోని పరాగ సంపర్కాలను ఎలా ప్రభావితం చేస్తాయి మరియు తద్వారా మన ఆహార సరఫరా ఎలా ప్రభావితం అవుతుంది అన్నది  తెలియజేస్తుంది.