ఐఐటీ బాంబే, ఐఐటీ మద్రాస్ మరియు ఐఐఐటి హైదరాబాద్ పరిశోధకులు కలిసి ఆంగ్లం నుండి అనేక భారతీయ భాషలకు స్పీచ్-టు-స్పీచ్  యాంత్రిక అనువాదం (SSMT) వ్యవస్థను రూపొందించారు.

పరిరక్షణ యొక్క కఠినమైన భూభాగాలపై మంచు చిరుతలు

Read time: 1 min
మైసూరు
14 జన 2022
పరిరక్షణ యొక్క కఠినమైన భూభాగాలపై మంచు చిరుతలు

[చిత్రం క్రెడిట్స్: రూప్సీ ఖురానా]

మానవ జనాభా ప్రపంచ భూభాగం లో  2% లో నివసిస్తున్నారు. ఈ భూభాగంలో మానవులతో పాటు పులులు మరియు చిరుత లాంటి పెద్ద మాంసాహార జంతువులు కూడా నివసిస్తున్నాయి. ఈ ఆకర్షణీయమైన జంతువులు అనేక జానపద కథలలో చిత్రీకరించటం మరియు పర్యాటకులను ఆకర్షించటం చూస్తూనే  ఉంటాము. కానీ ఈ జంతువులు మానవులతో స్థలం మరియు ఆహారం కోసం పోటీ పడటం సహజంగా గమనించబడింది.  ఈ పోటీ ఆ జంతువులు బ్రతకటానికి, వాటి సంయోగానికి, మరియు వాటి రక్షణ కు ప్రకృతి నైజంగా జరిగేది.

హిమాచల్ ప్రదేశ్ లోని  స్పితి వ్యాలీ లో వ్యవసాయ-పాస్టోరలిస్ట్ వర్గాలు  మరియు మంచు చిరుతలు ఆ లోయల ప్రాంతం కలిసి పంచుకొనుట ఒక విశేషం. ఈ కారణాన, 2020 లో భారత ప్రభుత్వం స్పితి వ్యాలీ ని మంచు చిరుతల సంరక్షణ మరియు వాటి జనాభాకు మద్దతు ఇవ్వగల   ప్రదేశముగా గుర్తించింది.

కానీ, ఈ లోయలో కూడా అన్య పర్వత పర్యావరణ ప్రదేశాల మాదిరిగానే అనూహ్య వాతావరణ హెచ్చుతగ్గులు, పర్యాటకం, అభివృద్ధి కార్యకలాపాలు మరియు వ్యాపార సంస్థల పెరుగుదల జరుగుతున్నాయి. ఈ కారకాలవలన భరాల్ (హిమాలయన్ బ్లూ షీప్) మరియు ఐబెక్స్ (కొండ గొర్రె) వంటి శాఖాహార జంతువుల ఆవాసాలు ప్రభావితం అవుతున్నాయి, మరియు వాటి సంఖ్య క్షీణతకు దోహదం చేస్తున్నాయి. దీని పర్యవసానం  ఆహార గొలుసు అధోకరణం. ఆ నష్టం మంచు చిరుతల మీద కూడా పడుతున్నది.  

ఇటీవల  అధ్యయనంలో, మైసూరులోని నేచర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ (Nature Conservation Foundation, Mysuru) పరిశోధకులు స్పితి లోయ లో మంచు చిరుత పులి సాంద్రత మరియు ఆవాసాల వాడకాన్ని ప్రభావితం చేసే అంశాలు పరిశోధించారు. ఈ అధ్యయనం ప్లోస్ వన్ (Plos One) పత్రికలో ప్రచురింపబడింది.

స్పితి స్థానికులు వ్యవసాయం మరియు యాక్, గుర్రాలు, మేకలు, గొర్రెలు వంటి పసువుల పెంపకదారులు. ఆ లోయల్లో అడవి శాఖాహారుల సంఖ్య తగ్గడం వలన మంచు చిరుత తరచుగా పశువులను భక్షించడం సాధారణం. దీనివల్ల స్థానికులకు రుణ నష్టం కలిగి, వారు ఆ చిరుతలను ప్రతీకార హత్య చేయడం జరిగి, మానవుడు- చిరుత  సహాజీవనం చెయ్యడం అస్థిరమవుతున్నది.

ఈ అధ్యయనంలో పరిశోధకులు 50 కుగ్రామలు మరియు గ్రామాలను పరిశీలించారు (జనాభా సంఖ్య 7 నుంచి 700 మంది). వారు క్షేత్రస్థాయి మరియు డోర్-టు-డోర్ సర్వే జరిపి, అక్కడ ఉన్న పశువుల సంఖ్య అంచనా వేశారు.

మంచు చిరుత పులి యొక్క సాంద్రతను అంచనా వేయడానికి, పరిశోధకులు పాద ముద్రలు (పగ్మార్క్లు), మలం (స్కాట్), మరియు జంతువు యొక్క వాసన గుర్తు కోసం అధ్యయన ప్రాంతాన్ని స్కాన్ చేశారు. వారు అక్టోబర్ -2011 నుండి జనవరి -2012 మధ్య జంతువుల ఉనికితో 30 సైట్లలో కెమెరా ఉచ్చులు మోహరించారు.

అడవి ఆహారం మరియు పశువుల జనాభా, మానవ స్థావరం నుంచి దూరం, ఎత్తు, మరియు స్థానిక భూమి మంచు చిరుత ఆవాసాల వాడకాన్ని ప్రభావితం చేసే కారకాలుగా రచయితలు తనిఖీ చేశారు. వారు ఈ కారకాలను పరిశోధించడానికి పర్యావరణ నమూనాలను ఉపయోగించారు మరియు అవి ఒక ప్రాంతంలో జంతువుల ఉనికిని ఎలా ప్రభావితం చేస్తాయి, ఈ ప్రాంతాలను మంచు చిరుతలు ఒకేలా ఉపయోగించుకున్నాయా అని కూడా వారు తనిఖీ చేశారు.

80 రొజుల్లో 25 క్యామెరాలలో 16 మంచు చిరుతలు కనిపించాయి. అధ్యయన స్థలం సుమారు 5000 చదరపు కిలోమీటర్లు. దానిలో కేవలం కొన్ని ప్రాంతాల్లో ప్రతి 100 చ.కి. మీ. కి ఒకటి కన్నా ఎక్కువ చిరుతలు ఉన్నాయి. 50% అధ్యయన స్థలంలో ఒక్కొ చిరుత 500  చ. కి. మీ. ఆక్రమించి ఉన్నాయి.

4000 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో కఠినమైన భూభాగాలలో పర్వత శిఖరాలు మరియు కొండల వెంట వెళ్ళడానికి ఈ చిరుతలు ఇష్టపడతాయి అని పరిశోధకులు కనుగొన్నారు.  పరిశోధన ఫలితాలు, పశువుల సంఖ్య కాకుండా, అడవి ఆహారం మంచు చిరుత సాంద్రతను నడిపిస్తాయి అని హైలైట్ చేస్తోంది. 

మరో అధ్యయనం ప్రకారం, అడవి శాఖాహార జంతువులు అధిక పశువుల సంఖ్య ఉన్న ప్రాంతాలను ఇష్టపడవు; పర్యవసానంగా, మంచు చిరుతలు కూడా ఆ ప్రదేశాలను  ఆక్రమించడానికి ఇష్టపడవు.

వీటిని బట్టి అధిక అడవి-ఎర సాంద్రత ఉన్న ప్రదేశాలు మంచు చిరుత జనాభాను నిర్వహించడానికి సహాయపడతాయి అని పరిశోధకులు సూచిస్తున్నారు.
అందువల్ల, మంచు చిరుత సంరక్షణకు సహాయపడటానికి అడవి-ఎర నివాస ప్రదేశాలను సంరక్షించడం చాలా ముఖ్యం.

"పశువులతో పోటీని తగ్గించడం, జీవనోపాధి మరియు క్రీడల కోసం అడవి ఎరను వేటాడటం లేదా చట్టవిరుద్ధంగా వేటాడడాన్ని నిరోధించడం అడవి శాఖాహారి జనాభా నిర్వహణకు దోహదపడుతుంది," అని అధ్యయనం రచయిత డాక్టర్ కౌస్తుభ్ శర్మ చెప్పారు. అతను మైసూరు నేచర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ (ఎన్‌సిఎఫ్) మరియు  అమెరికాలోని సియాటెల్లోని మంచు చిరుత ట్రస్ట్ లో శాస్త్రవేత్త.

మంచు చిరుతలు ఏటా వందలాది పెంపుడు జంతువులను చంపుతున్నాయి, కొన్ని ప్రాంతాల్లో వారి ఆహారం 50% వరకు వీటి నుంచి లభ్యమవుతుంది. కావున, పరిరక్షణ వ్యవహారాలలో, స్థానికులను వాటాదారులుగా చేర్చడం చాలా అవసరం. ఇది జంతువుల పరిరక్షణకు స్థానికులు చురుకుగా పాల్గొనడానికి వీలు కల్పిస్తుంది మరియు వన్యప్రాణులకు అనుకూలమైన పద్ధతులు అవలంబించడానికి అనుమతిస్తుంది.

"స్థానిక సమాజాలతో సంప్రదించి మేత రహిత శాశ్వత లేదా కాలానుగుణ సమితులను ఏర్పాటు చేయడం చాలా ముఖ్యం, ఇక్కడ పశువులు మొత్తం మొక్కల జీవ పదార్థాలను మేయవు" అని కౌస్తుభ్ చెప్పారు. ఉన్ని, పాడి, పర్యాటక క్రియలు వంటి ఆర్థిక అభివృద్ధి నమూనాలను ప్రకృతి- అనుకూల పద్ధతులు పాటించడం వలన, ప్రజలు మరియు వన్యప్రాణుల మధ్య స్థిరమైన సహజీవనానికి దారితీస్తుందని ఆయన చెప్పారు.

స్థానికులు మంచు చిరుతలను వేటాడుట పర్యావరణ సమస్య. పరిరక్షణ ప్రయత్నాలలో సమాజ ప్రమేయం కారణంగా ఇలా చంపడం తగ్గినప్పటికీ, మంచు చిరుతపులులు మరియు వాటి ఆవాసాల పరిరక్షణ కార్యాలు చేయడానికి ఇంకా చాలా ఉన్నాయి.

భారతదేశం, ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, చైనా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, మంగోలియా, నేపాల్, పాకిస్తాన్, రష్యా, తజికిస్తాన్ మరియు ఉజ్బెకిస్తాన్ ప్రాంతాలను కలుపుతూ మంచు చిరుత ఆవాసాలు 2 మిలియన్ చ. కి. మీ. లో విస్తరించి ఉన్నాయి. ఈ జంతువులు నివసించే భూమి అంతటా సాంస్కృతిక, రాజకీయ, భౌగోళిక మరియు పర్యావరణ భేదాలు ఉన్నాయి.

కావున, ఆయా ప్రదేశాల్లో, పరిరక్షణకు ప్రస్తుత విధానం- అచ్చట మానవ నివాస భూమిని  మరియు చర్యలను చట్టం  ద్వారా పరిమితం చేయడం. అది అడవి శాఖాహారి జనాభాను మరియు పెద్ద మాంసాహారులను నిలబెట్టడానికి సహాయపడుతుంది అని డాక్టర్ బైరాన్ వెక్వర్త్ చెప్పారు. బైరాన్  మంచు చిరుత ప్రోగ్రామ్ మరియు కన్జర్వేషన్ జెనెటిక్స్ ఫర్ పన్థెరాకు డైరెక్టర్. వారు ఈ అధ్యయనంలో పాల్గొనలేదు. 

అయినప్పటికీ, స్థానిక మేత-భూములు పై వారి హక్కులను విస్మరించలేము. జీవవైవిధ్య సంరక్షణ కోసం అడవి శాఖాహారి మరియు పాడి పసువుల జనాభాల  సహజీవన మార్గాలు అమలు చెయ్యటమొక్కటే సరి అయిన తీరు అని బైరన్ అభిప్రాయపడ్డారు. జీవవైవిధ్య పరిరక్షణ ఏకశిలా మార్గాలు కాకుండా సమగ్రంగా ఉండాలి, అని అన్నారు.


సంపాదకుని గమనిక: ఈ కథనం లో చిన్న లోపాలు సవరించబడినాయి