ఐఐటీ బాంబే, ఐఐటీ మద్రాస్ మరియు ఐఐఐటి హైదరాబాద్ పరిశోధకులు కలిసి ఆంగ్లం నుండి అనేక భారతీయ భాషలకు స్పీచ్-టు-స్పీచ్  యాంత్రిక అనువాదం (SSMT) వ్యవస్థను రూపొందించారు.

క్యాన్సర్ కణితి తిరిగి పెరగడాన్ని నిరోధించడానికి రోజూ కాకుండా వారానికోసారి క్యాన్సర్ మాత్రలు వేసుకుంటే చాలు, అని ఒక అధ్యయనం కనుగొంది

ముంబై
1 ఏప్రి 2022
క్యాన్సర్ కణితి తిరిగి పెరగడాన్ని నిరోధించడానికి రోజూ కాకుండా వారానికోసారి క్యాన్సర్ మాత్రలు వేసుకుంటే చాలు, అని ఒక అధ్యయనం కనుగొంది

ఇప్పుడు, ఊపిరితిత్తుల క్యాన్సర్ కణితి అణచడానికి రోజూవారి మాత్రలు అవసరం కాకపోవచ్చు

క్యాన్సర్ అనేది అస్తవ్యస్తంగా పెరిగే కణాల ద్రవ్యరాశి. ఈ కణాలు నియంత్రణ మరియు పోషణ లేకపోయినా పెరుగుతాయి. శస్త్రచికిత్స ద్వారా క్యాన్సర్ పెరుగుదలను తొలగించినప్పటికీ, కొంత సమయం తర్వాత కొన్ని కణితులు పునరావృతం అవుతాయి.

ఎర్లోటినిబ్ (Erlotinib) మరియు ఒసిమెర్టినిబ్ ( Osimertinib ) అనే మందులు ఊపిరితిత్తుల క్యాన్సర్ నివారణకు వాడతారు. ఈ మందులు పరివర్తన చెందిన జన్యువులను వ్యతిరేకంగా ఉద్దేశించి తయారు చేయబడిన  కొన్ని కొత్త తరం మందులు మరియు  ఎపిడెర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్ రిసెప్టర్, (Epidermal Growth Factor Receptor), (EGFR) అని పిలువబడే జన్యువు ఉత్పరివర్తనలు కలిగిన ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగులకు ఆమోదించబడ్డాయి.

ప్రస్తుతం, ఈ సందర్భాలలో ముందస్తు చికిత్స ప్రక్రియగా ఈ మందులు రోజువారీ మోతాదు లో ఇవ్వబడుతున్నాయి. కానీ, ఈ మందుల వల్ల  తీవ్రమైన దుష్ప్రభావాలు ఉండటంతో, మందు మోతాదు తగ్గించడాన్ని సమర్థించే ఏ జరుగుతున్న పరిశోధనా అధ్యయనం అయినా అత్యంత యుక్తమైనది..

నవీ ముంబైలోని అడ్వాన్స్‌డ్ సెంటర్ ఫర్ ట్రీట్‌మెంట్, రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ క్యాన్సర్ (ACTREC) పరిశోధకుల బృందం, ఓసిమెర్టినిబ్ యొక్క వారంవారీ మోతాదు రోజువారీ మోతాదు వలె ప్రభావవంతంగా ఉంటుందా అని పరిశోధించింది. వారు ఎలుక నమూనాలలో ఊపిరితిత్తుల క్యాన్సర్ అభివృద్ధిపై ప్రయోగాలు నిర్వహించారు.

ట్రాన్స్లేషన్ ఆంకాలజీ లో ప్రచురించబడిన వారి అధ్యయన ఫలితాలు ఒసిమెర్టినిబ్ యొక్క వారం వారం ఔషధ మోతాదు ముందు చికిత్సగా రోజువారీ మోతాదు లాగా అదే ఫలితాలు అందిస్తుందని చూపిస్తోంది. కణితులను అణిచివేసేందుకు ఈ వారంవారీ మోతాదు బహుశా ఎర్లోటినిబ్ రోజువారీ మోతాదు కంటే మంచిది అయి ఉండవచ్చు.

ఇటీవల ADAURA క్లినికల్ ట్రయల్ రోగులలో కణితి పునఃస్థితి తగ్గించడానికి మరియు వారికి వ్యాధి-రహిత మనుగడను విస్తరించడానికి సహాయక ఔషధంగా రోజూవారి మోతాదులో ఒసిమెర్టినిబ్ ప్రయోజనాన్ని స్థాపించింది. (అంటే, శస్త్రచికిత్స ద్వారా కణతిని తొలగించిన తర్వాత ఇచ్చిన తదుపరి చికిత్స). ప్రస్తుతం, అదే మందు యొక్క రోజువారీ మోతాదు వాడకం రోగికి నెలకు రెండు లక్షల కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది.

"ఒసిమెర్టినిబ్ యొక్క రోజువారీ మోతాదుకు బదులుగా వారానికొకసారి ఇదే విధమైన ప్రభావాన్ని సాధించవచ్చని మా అధ్యయనం సూచిస్తుంది, ఇది ఖర్చును ఏడో వంతు వరకు తగ్గిస్తుంది" అని పరిశోధన బృందం అధిపతి డాక్టర్ అమిత్ దత్ చెప్పారు.

పైగా, తగ్గిన మోతాదు వల్ల మందుల దుష్ప్రభావం కూడా తగ్గుతుంది; అంతేకాకుండా, వారపు మోతాదును వాడటం మరింత సులువైంది, అని ఆయన జోడించారు. వారి అన్వేషణను ధృవీకరించడానికి ముంబైలోని టాటా మెమోరియల్ హాస్పిటల్‌లో క్లినికల్ ట్రయల్ ప్రస్తుతం ప్రారంభించబడింది.

వారి ప్రయోగాల కోసం, బృందం ఊపిరితిత్తుల క్యాన్సర్ కోసం తోక సిర (టెయిల్ వెయిన్ ) ఎలుక నమూనాను ఉపయోగించింది.ఈ విధానంలో, క్యాన్సర్-ప్రేరేపిత కణాలు ఎలుక తోక సిర ద్వారా జంతువు లోపలికి ఎక్కించబడతాయి. ఈ కణాలు 24 గంటల్లో ఎలుకల ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తాయి. క్యాన్సర్ కణాలలో జన్యుపరంగా నియంత్రించిన (genetically engineered) ఒక కాంతివంతమైన ప్రోటీన్ సూచకాన్ని (protein marker) ఉపయోగించి, పరిశోధకులు జంతువుల ఊపిరితిత్తులలోని ఈ కణాల జాడ తెలుసుకుంటారు. ఈ నియంత్రించిన క్యాన్సర్ కణాలు లూసిఫేరేస్ అనే ఎంజైమ్‌ను వ్యక్తపరుస్తాయి మరియు రసాయన ప్రతిచర్య కాంతిని ఇస్తుంది. ప్రకాశించే క్యాన్సర్ కణాలు వాటి ప్రస్తుత స్థానాన్ని మరియు వ్యాప్తిని సూచిస్తాయి.

పరిశోధకులు ఐదు ఎలుక సమూహాలలో ప్రయోగాలు జరిపారు; ప్రతి సమూహంలో ఆరు ఎలుకలు. రెండు ఎలుక సమూహాలకు రోజూవారి మందులు, రెండిటికి వారం వారి, మరియు ఒక సమూహానికి ఏ మందూ ఇవ్వకుండా (అంటే, కంట్రోల్ గ్రూప్) ప్రయోగాలు జరిపారు. EGFR పరివర్తన చెందిన మానవ ఊపిరితిత్తుల క్యాన్సర్ కణాలను ఎలుకలకు ఎక్కించే ముందు మోతాదు ప్రకారం వారు ఎలుకలకు ఎర్లోటినిబ్ మరియు ఒసిమెర్టినిబ్‌లతో ముందస్తు చికిత్స చేశారు.
 

(Image credits: authors of the paper)

ప్రీ-ట్రీట్‌మెంట్ అని పిలువబడే ఈ ప్రక్రియలో, మానవులలో శస్త్రచికిత్స అనంతర పరిస్థితిని అనుకరించడానికి, వ్యాధి అభివృద్ధి చెందడానికి ముందు (ఇక్కడ, క్యాన్సర్ కణాలను ఇంజెక్ట్ చేసే ముందు) మందులు ఇవ్వబడతాయి. (మానవ పరీక్షల్లో, మందులు శస్త్రచికిత్స తర్వాత ఇవ్వబడతాయి).

పరిశోధకులు, ప్రతి సమూహాల నుండి ఎలుకలకు ట్యాగ్ చేయబడిన ప్రకాశించే క్యాన్సర్ కణాలను ఇంజెక్ట్ చేసి పర్యవేక్షించారు. ఎర్లోటినిబ్ ఇచ్చిన సముహాలు మరియు నియంత్రణ సమూహాల లో (కంట్రోల్ గ్రూప్) కొన్ని ఎలుకలు ఇంజెక్షన్ మొదటి రోజు తర్వాత కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ కణాల ఉనికిని చూపించాయని బృందం గమనించింది.

కానీ రోజువారీ మరియు వారపు మోతాదులలో ఓస్మినిట్రిబ్‌తో ముందే చికిత్స చేయబడిన సమూహాలలో ఎలుకలు ఏవీ ఇంజెక్ట్ చేసిన మూడు రోజుల తర్వాత కూడా ఊపిరితిత్తులలో క్యాన్సర్ కణాల జాడలను చూపించలేదు. అలాగే వారు 30వ రోజు వరకు కూడా ఊపిరితిత్తులలో ఎటువంటి కణితి అభివృద్ధి చెందడం గమనించలేదు. దీనిని బట్టి, ఆస్మినిట్రిబ్ యొక్క రోజువారీ మరియు వారపు మోతాదులు ఒకే విధమైన ఫలితాలు ఇస్తాయని పరిశోధకులు గమనించారు.

ఊపిరితిత్తుల నుండి క్యాన్సర్ కణాలను తొలగించడంలో వారపు మోతాదులో ఎర్లోటినిబ్ కంటే ఒసిమెర్టినిబ్ ఔషధం సమర్థత కు కారణం ఆ మందు ఆలస్యంగా  జీర్ణం అవ్వడం వల్ల కావచ్చు. అంటే,  ఒసిమెర్టినిబ్ ఔషధం త్వరగా జీర్ణం కాకుండా   ఎక్కువ కాలం శరీరంలో ఉంటుంది అని రచయితలు అంటున్నారు.

"ఎర్లోటినిబ్‌ యొక్క హాఫ్-లైఫ్ 24 గంటల కంటే ఎక్కువ కావడంతో, దీన్ని రోజూ వారీ తీసుకుంటే ఉండే ప్రయోజనం తక్కువ. వారానికొకసారి తీసుకున్నా గానీ  శరీరంలో ఉండి దాని పని చేస్తుంది" అని డాక్టర్ దత్ చెప్పారు.

కణితి ఉత్పాదక ప్రదేశాలు మరియు ఊపిరితిత్తులలో ఒసిమెర్టినిబ్ యొక్క గరిష్ట జీవ లభ్యత (లక్ష్యాన్ని చేరుకోవడానికి రక్తంలో ఎంత ప్రసరింపబడుతుంది) కూడా దీనికి కారణం కావచ్చు. ఇది రక్తం నుండి తక్కువ క్లియరెన్స్ మరియు మానవ శరీరంలో అధిక పంపిణీని కలిగి ఉందని ఆయన చెప్పారు.

వారి పరిశీలన ఆధారంగా, ఒసిమెర్టినిబ్‌తో ఊపిరితిత్తుల క్యాన్సర్ ముందస్తు చికిత్స రోజువారీ లేదా వారానికోసారి రోగులలో కణితి పునరావృతం కావడానికి ఆలస్యం చేయడానికి ఆచరణీయమైన చికిత్స ఎంపికను అందించవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు. ప్రారంభ దశలో ఉన్న కణితుల శస్త్రచికిత్స తర్వాత ఔషధాన్ని సహాయక చికిత్స గా ఉపయోగించవచ్చు.

ఇంకా, క్యాన్సర్ కణాల లో సాధారణంగా ఉపయోగించే మందులకు త్వరగా నిరోధకత పెరుగుతుంది. కాబట్టి, మందులు తక్కువ మోతాదులో (వారం వారం మోతాదులలో వలె) వాడితే మందు-నిరోధకత కలిగే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది.

“తిరిగి వచ్చే కణితలు తరచుగా మొదటి తరం ఎర్లోటినిబ్‌కు నిరోధకతను కలిగి ఉంటాయి; అందువలన, రోజువారీ మోతాదు ఎన్నిక సరి  కాదు. మా అధ్యయనం లో వారం మోతాదుతో ఒసిమెర్టినిబ్‌ ముందస్తు చికిత్సను సూచించి, రోజువారీ మోతాదుకు సమానమైన ప్రతిస్పందనను ఉత్పత్తి చేస్తుంది కాబట్టి, మందు-నిరోధకత ఆలస్యం కావచ్చు లేదా అడ్డుకోవచ్చు,” అని డాక్టర్ దత్ చెప్పారు.

Telugu