ఐఐటీ బాంబే, ఐఐటీ మద్రాస్ మరియు ఐఐఐటి హైదరాబాద్ పరిశోధకులు కలిసి ఆంగ్లం నుండి అనేక భారతీయ భాషలకు స్పీచ్-టు-స్పీచ్  యాంత్రిక అనువాదం (SSMT) వ్యవస్థను రూపొందించారు.

మనమే కాదు, జంతువులు కూడా వాహనాల శబ్ద- కాలుష్యానికి గురవుతున్నాయి

Read time: 1 min
జైపూర్
4 మార్చి 2022
వాహనాల శబ్దం వల్ల జంతువులకు ఇబ్బంది కలుగుతుంది.

వాహనాల శబ్దం వల్ల జంతువులకు ఇబ్బంది కలుగుతుంది [picture credits leopard and safari vehicle via Wikimedia Commons]

ఆరావళి పర్వత శ్రేణుల మధ్య మరియు రాజస్థాన్‌లోని జైపూర్ నగరం నడిబొడ్డున 29 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ముడి అరణ్యం ఉంది. అదే ఝలానా రిజర్వు అడవి. ఒకప్పుడు వన్యప్రాణులు -- పులులు, చిరుతలు, పందులు, జింకలు మరియు వివిధ పక్షులతో -- ఝలానా, జైపూర్ మహారాజులకు ఇష్టమైన వేట స్థలం. కానీ, మానవ విధ్వంసం వలన చాలా వరకు పులులు మరియు పెద్ద పిల్లులు నశించి పోయాయి; ఇప్పుడు కేవలం దాదాపు 35 చిరుతపులులు అడవిలో మిగిలి ఉన్నాయి. అవి ఝలానా అడవుల ఏకైక అగ్ర మాంసాహారులు.

చిరుతపులులు సంకోచ పరులు మరియు ప్రాదేశిక పరులు. కానీ, ఝలానా లో, చిరుతలు స్వేచ్ఛగా తిరుగుతూ కనిపిస్తాయి మరియు మానవ కార్యకలాపాల స్థలంలోకి  తరచూ దాటుతూ ఉంటాయి. ఇది ఆశ్చర్యకరమైన మానవ-మాంసాహారి పరస్పర స్పందన పరిస్థితి అయినందువలన, వన్యప్రాణి పరిశోధకులను ఆకర్షిస్తోంది.

రాజస్థాన్ ఫారెస్ట్ సర్వీస్, ఈ రిజర్వ్‌లో వాహనాలను పరిమితం చేసింది, సి సి టి వి (CCTV) కెమెరాలను వ్యవస్థాపించింది మరియు మానవ చొరబాట్లను తనిఖీ చేయడానికి గస్తీ పెంచింది.

"ఈ చర్యలు ఉన్నప్పటికీ, డిపార్ట్‌మెంట్‌లో రిజర్వ్‌ను నిర్వహించడానికి మరియు మానవ-మాంసాహార విభేదాలు లేని సున్నితమైన పరిస్థితి నియంత్రించడానికి శాస్త్రీయ మూలాధార సిధ్ధాంతాలు లేవు," అని పూణేలోని ఝలానా వైల్డ్‌లైఫ్ రీసెర్చ్ ఫౌండేషన్‌ (Jhalana Wildlife Research Foundation) లోని పరిశోధకుడు శ్రీ స్వప్నిల్ కుంభోజ్కర్ చెప్పారు.

కాబట్టి, శ్రీ కుంభోజ్కర్, అంతర్జాతీయ వన్యప్రాణుల నిపుణుల బృందంతో కలిసి, ఝలానా రిజర్వ్‌ను నిర్వహించడానికి మరియు వన్యప్రాణులపై మానవ అభివృద్ధి మార్పుల ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించాలని ఒక ప్రతిపాదనను సమర్పించారు.

ఇటీవల, సఫారీ వాహనాల శబ్ద స్థాయిలు కొన్ని క్షీరదాలు మరియు పక్షుల ప్రవర్తన మరియు ప్రతిస్పందనను ఎలా ప్రభావితం చేస్తాయో ఈ బృందం అంచనా వేసింది. వారి పరిశీలనలు, యూరోపియన్ జర్నల్ ఆఫ్ వైల్డ్‌లైఫ్ రీసెర్చ్ జర్నల్‌లో ప్రచురించబడ్డాయి.  వారి అధ్యయనంలో, నెమ్మదిగా ఉండే ఎలక్ట్రిక్ సఫారీ వాహనాలు(electric safari vehicles) వన్యప్రాణులకు కలిగే ఆటంకానికి గణనీయమైన తేడా ను కలిగిస్తాయి అని నిర్ధారించారు.

వారి అధ్యయనం పర్యావరణ పర్యాటక పద్ధతులకు ప్రమాణం అయ్యింది. ఈ అధ్యయనం ఫలితంగా, ఝలానా సమీపంలో రాబోయే ఇంకొక రిజర్వ్ అడవి పర్యాటకానికి  ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసే ప్రక్రియలో ఉంది.

2017లో, అటవీ శాఖ ఝలానాను అటవీ రిజర్వ్‌గా ప్రకటించింది మరియు చిరుతపులి పర్యాటకం (సఫారీ) కోసం ద్వారాలను తెరిచింది. సఫారీకి  అణుగుణంగా వాహనాలు (జిప్సీ - ఆఫ్-రోడ్ వాహనం) వినియోగించాలని అటవీ శాఖ తప్పనిసరి చేసింది. 2019లో, వారు ఆరు ఎలక్ట్రిక్ వాహనాలు (మహీంద్రా ఈ-వాహనాలు) వారి వాహన దళానికి జోడించారు.

సఫారీ వాహనాల వల్ల కలిగే శబ్దానికి అనేక రకాల పక్షులు మరియు క్షీరదాలు ఎలా స్పందిస్తాయో బృందం వారం రోజుల పాటు పరిశీలించి  నమోదు చేసింది.

"జంతువులు శబ్దాలకు మూడు విధాలుగా ప్రతిస్పందిస్తాయి - ఎ) ప్రారంభ చురుకుదనం బి) క్లుప్తంగా చూడటం మరియు గమనించడం సి) ముప్పును గుర్తించినప్పుడు, పారిపోవడం,” అని అధ్యయనం యొక్క మొదటి రచయిత మరియు వన్యప్రాణి పరిశోధకుడు ప్రొఫెసర్ రూవెన్ యోసెఫ్ చెప్పారు.

ఆయన ఇజ్రాయెల్‌లోని బెన్ గురియన్ విశ్వవిద్యాలయంలో నెగెవ్-ఈలాట్ క్యాంపస్‌లోని పరిశోధకుడు మరియు గతంలో మహారాష్ట్రలోని బోర్‌లో పులులపై విస్తృతంగా పనిచేశారు.

అంతర్జాతీయ అధ్యయనాలు జంతువులు మానవ ఉనికి పట్ల జాగ్రత్తగా ఉంటాయి మరియు మేత, విశ్రాంతించడం లేదా ఆహారం తీసుకునే కార్యాలలో కదలకుండా నిలబడటం లాంటి ప్రవర్తనలను ప్రదర్శిస్తాయి అని  చూపించాయి. అటువంటి ప్రతిచర్యలు ఎక్కువ కాలం పాటు కొనసాగితే, అది జంతువుల సాధారణ ప్రవర్తనా విధానాలు మార్చగలవు.

ఎలక్ట్రిక్ -వాహనాల లో, శబ్దం స్థాయి తక్కువగా ఉంటుంది మరియు అందువల్ల జంతువుల సాధారణ ప్రవర్తనకు తక్కువ భంగం కలుగుతుందని పరిశోధకులు ఊహించారు.

సాధారణ సఫారీ వాహనం (ఏ) vs ఇ-వాహనాల (కు) శబ్ద స్థాయిలను చూపే యాప్ నుంచి రీడ్-అవుట్

సౌండ్ మీటర్ యాప్ అనే మొబైల్ యాప్ ను  ఉపయోగించి, పరిశోధకులు అన్ని వాహనాల ఇంజిన్ శబ్దాన్ని మూడు వేర్వేరు పరిస్థితుల్లో కొలిచారు - ఐడ్లింగ్ (idling), రన్నింగ్ (running), మరియు రేవ్వింగ్ (revving) మోడ్‌లలో. యాప్ శబ్దం యొక్క కనిష్ట, గరిష్ట మరియు సగటు స్థాయిలను (డెసిబెల్‌లలో) కొలవడానికి అనుకూలించింది. తరువాత వారు మూడు స్థితులు కు  సంబంధించిన అన్ని వాహనాల మొత్తం శబ్ద స్థాయిని కొలిచారు.

వారి అధ్యయనంలో ముఖ్యమైన జంతు ప్రతిస్పందన అంశం ఫ్లైట్ ఇనిషియేషన్ డిస్టెన్స్ (FID). FID అనేది జంతువు పారిపోయే లోపు వాహనం జంతువుకు చేరుకోగల అత్యంత సమీప దూరం. రేంజ్‌ఫైండర్‌లతో కూడిన బైనాక్యులర్‌లు పరిశీలనలో ఉన్న ప్రతి జంతు జాతి  FID దూరాన్ని కొలవడానికి బృందానికి సహాయపడ్డాయి. వారు మొత్తం 13 వాహనాలకు మూడు  పరిస్థితుల ఆపరేషన్‌లో రోజువారీ కొలతలు చేశారు. మొత్తం మీద, వారు 227 FID లు గమనించారు -- 174 ఐదు పక్షి జాతుల లో మరియు మూడు క్షీరద జాతుల లో 53.

అయితే, వన్యప్రాణుల పరిశీలన సంక్లిష్ట భొగట్టాలను మరియు విశ్లేషణలకు దారితీసే బహుళ ప్రమాణాలు కలిగి ఉంటుంది. ఉదాహరణకు, వివిధ జాతులు శబ్దాలను భిన్నంగా గ్రహిస్తాయి; వాతావరణం మరియు  వాహనం టైర్లు అడవి బాటలో కంకర పై రుద్దడం వల్ల శబ్దాన్ని పెంచుతుంది. అంతేకాకుండా, మానవులను ముప్పుగా భావించే జంతు జాతుల-ఆధారిత అంశాలు కూడా అడవిలో అమల్లోకి వస్తాయి.

అందువల్ల, పరిశోధకులు పరిశీలన డేటాలో అసంబద్ధమైన ప్రమాణాలు సాధారణీకరించడం మరియు తొలగించడానికి గణాంక మరియు గ్రాఫికల్ పద్ధతులు ఉపయోగించారు. సంక్లిష్ట డేటాను విశ్లేషించడానికి వారు జనరల్ లీనియర్ మిక్స్‌డ్ మోడల్ (GLMM) విధానాన్ని ఉపయోగించారు. GLMM అనేది ఒక అనుక్రమంగా జరిగే విశ్లేషణ పద్ధతి. దీనిలో విశ్లేషణ యొక్క ప్రతి వరుస దశలో అవాంఛిత డేటాని తీసివేసి  డేటాను అత్యంత ప్రతి క్రియాశీల ప్రమాణానికి తగ్గిస్తుంది.

"ఈ పద్ధతి ద్వారా, మేము అత్యంత ముఖ్యమైన ప్రమాణాలు వేరుచేయడం ప్రారంభించవచ్చు మరియు విశ్లేషణ ముఖ్యమైన భాగాలు తగ్గించవచ్చు. అప్పుడు, మాకు ముఖ్యమైన సంబంధాన్ని అందించే జంతు జాతుల ప్రతిచర్యలపై కేంద్రీకరించవచ్చు,” అని ప్రొఫెసర్ యోసెఫ్ చెప్పారు. ఈ అధ్యయనంలో జంతు ప్రతిచర్య అనేది గణాంక పరంగా ముఖ్యమైన ప్రమాణం, పర్యావరణ కారకాలు కాదని ఆయన అదనంగా అన్నారు.

ఉదాహరణకు, ప్రారంభ విశ్లేషణలో పక్షులు మరియు జంతువులు కలిసిన  పెద్ద డేటాసెట్‌ కలిగి ఉంది. కానీ, పక్షులు చెట్ట్లపై ఉండటం వలన వాహనాల శబ్దాన్ని తక్కువ ముప్పుగా గుర్తించాయి మరియు అవి శబ్ద స్థాయికి ప్రభావితం కాలేదని వారు గమనించారు. అందువల్ల, వారు తదుపరి విశ్లేషణ లో పక్షుల ప్రతిస్పందన డేటా  లెక్కలోకి రాలేదు.

తక్కువ శబ్దం ఉండే ఈ-వాహనాలు జంతువు యొక్క తక్కువ ఫ్లైట్ ఇనిషియేషన్ దూరాన్ని కలిగి ఉంటాయి (చిత్ర సౌజన్యం రచయితలు)

ఎలక్ట్రిక్ వాహనాల కంటే సాధారణ ఆఫ్-రోడ్ వాహనం శబ్దాన్ని జంతువులు ముప్పుగా భావించి పారిపోయే దూరం ఎక్కువ, అని బృందం గమనించింది. మరో మాటలో చెప్పాలంటే, సాధారణ వాహనాలతో పోలిస్తే ఈ-వాహనాలకు ఫ్లైట్ ఇనిషియేషన్ దూరం తక్కువ అన్నమాట.

"ఈ విశ్లేషణ నుంచి, జంతువుల నుంచి ప్రతిచర్యను ప్రేరేపించే వాహన రకం కీలకమైన ప్రమాణం అని మేము నిర్ధారించాము," అని రచయితలు చెప్పారు. వారు జంతు జాతుల ప్రతిస్పందనలను విశ్లేషించినప్పుడు, చిరుతపులులు (సంకోచ జీవులు) నుంచి అత్యంత ముఖ్యమైన ప్రతిచర్యను పొందినట్లు కనుగొన్నారు.

పర్యావరణ పర్యాటకాన్ని నిర్వహించడానికి శాస్త్రీయ పద్ధతులు తప్పనిసరి అని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. "వన్యప్రాణుల అధ్యయనం ఒక ప్రజాకర్షక ప్రాజెక్ట్ కాదు లేదా సాధారణ అవగాహనకు వదిలివేయకూడదు. దీనికి విరుద్ధంగా, వన్యప్రాణుల యొక్క నిజమైన అవగాహన శాస్త్రీయంగా మాత్రమే జరగాలి, మరియు సమగ్రముగా, వ్యవహార పరంగా అధ్యయనం చేయబడాలి," అని ప్రొఫెసర్ యోసెఫ్ నొక్కి చెప్పారు.

ప్రస్తుత పరిస్థితిలో ఏ మార్పు తీసుకు వచ్చినా, అవి శాస్త్రీయపరంగా పూర్తిగా సమర్ధించ బడాలి అని నిపుణులు నొక్కి వక్కాణించారు. ఏ అభివృద్ధి కార్యకలాపం పర్యావరణంలో ఏ వ్యత్యాసాన్ని తెస్తుంది అనేది  ముందుగానే అధ్యయనం చేయాలి. కాబట్టి రిజర్వ్‌గా ప్రకటించినప్పటికీ, ఆ ప్రాంతాన్ని స్థానిక అధికార పరిధికి వదిలివేయకూడదు. అన్యథా, సున్నితమైన సమతుల్యతను కొనసాగించడానికి పాలకమండలి తప్పనిసరిగా శాస్త్రవేత్తలతో కలిసి పనిచేయాలి.

“ఎందుకంటే, ఒక చిన్న పొరపాటు వలన సమతుల్యత భంగమయితే, మానవ-జంతువుల సహజీవనం త్వరలో సంఘర్షణ గా మారుతుంది,” అని రచయితలు హెచ్చరిస్తున్నారు.