ఐఐటీ బాంబే, ఐఐటీ మద్రాస్ మరియు ఐఐఐటి హైదరాబాద్ పరిశోధకులు కలిసి ఆంగ్లం నుండి అనేక భారతీయ భాషలకు స్పీచ్-టు-స్పీచ్ యాంత్రిక అనువాదం (SSMT) వ్యవస్థను రూపొందించారు.
General
పరిశోధకులు ముఖ కవచంపై హైడ్రోఫోబిక్ పొర పూయడం ద్వారా వాటి సామర్థ్యాన్ని మెరుగుపరిచారు.
వింత వింత అలంకరణలు, చైతన్య పూరితమైన రంగులు, అద్భుతమైన సువాసనలు – పువ్వులు, పరాగ సంపర్కం కోసం ఎంపిక అమరికలను అందిస్తాయి. వాస్తవానికి, తేనెటీగలు, సీతాకోక చిలుకలు మరియు ఇతర పరాగసంపర్క కీటకాలు తాము సందర్శించే పువ్వులలో ప్రత్యేక ప్రాధాన్యతలను ఎంచుకుంటాయి అని అధ్యయనాలు చూపిస్తున్నాయి. అంతేకాదు మారుతున్న వాతావరణానికి అనుగుణంగా తమ అభిరుచులను కూడా సర్దుబాటు చేసుకుంటాయి.
ఎలక్ట్రిక్ పర్యాటక వాహనాలు జంతువులకు అంతగా ఇబ్బంది కలిగించవని ఒక అధ్యయనం కనుగొంది
ఆస్ట్రేలియాలోని క్రిస్మస్ ద్వీపంలో ఎర్ర పీతల వలస కు సురక్షితమైన దారి ఏర్పరిచే పీతల వంతెన. (Photo credit; Wondrous World Images via parksaustralia.gov.au)
ఆస్ట్రేలియాలోని క్రిస్మస్ ద్వీపంలో, ప్రయాణీకులకు ‘జంతువులు దాటు దారి’ అని హెచ్చరించే సూచనలు సరిపోవు; ట్రాఫిక్ మళ్లింపు, బహిరంగ ప్రకటనలు మరియు శాశ్వత వంతెనలు అవసరం, ఎందుకంటే ద్వీప రహదారులు పీతల సముద్రం గుండా వెళ్ళాలి! ఆ ద్వీపం లో కనిపించే పీతల వలస వార్షిక కార్యక్రమం మరియు ఒక సహజ అద్భుతం.
కేరళలోని కొట్టాయం లో వృద్ధ వితంతువులకు ఆరోగ్య సంరక్షణ సౌలభ్యాలు పెంపొందించడంలో సామజిక సంబంధాలు (సోషల్ నెట్‌వర్కింగ్ ) కీలక పాత్ర పోషిస్తుందని ఒక అధ్యయనం గుర్తించింది.
రెండు కప్ప జాతుల కడుపులో పదార్థాలను వివరణాత్మకంగా విశ్లేషించగా, పురుగుల నుండి పంటలను రక్షించడంలో కప్పలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని రుజువులు చూపిస్తున్నాయి.
పక్షుల రంగురంగుల ఈకలు, పులి పొడవాటి గోళ్లు, ఖడ్గమృగం యొక్క విలువైన కొమ్ము, జింక కొమ్ములు, పాంగోలిన్ (అలుగు)పొలుసులు, కాష్మీరు మేక యొక్క చక్కటి ఉన్ని, మరియు రపుంజీల్ యొక్క పొడవాటి జుట్టు – వీరి అందరిలో సమాన్యాంశం ఏమయ్యుండచ్చ్చో చెప్పగలరా?ఈ ప్రశ్న మిమ్మల్ని తల గోక్కునే లాగా లేదా గోళ్ళు కొరకడం చేసిందా? గోళ్ళ మాటకొస్తే, దానిలో కూడా ఉంది!ఇది వెన్నెముక గల జీవుల చర్మం లేదా ఎపిథీలియల్ (epithelial) కణాల్లో కనిపించే సర్వవ్యాప్తి ప్రోటీన్ – కెరాటిన్. కెరాటిన్ ప్రకృతిలో బలమైన పదార్థాల లో ఒకటి.
సీతాన తొండల (ఫ్యాన్-థ్రోటెడ్ బల్లి) జాతుల సంకేతాలు అందించే వ్యవస్థలో మార్పులు వాటి పరిణామానికి చిహ్నాలు కావచ్చు అని పరిశోధకులు కనుగొన్నారు
ప్లాస్టిక్‌లు మొండి చెత్త; అవి జీవఅధోకరణం (biodegrade) చెందవు. అయినప్పటికీ, మన విచక్షణారహిత మయిన ప్లాస్టిక్ వాడకం వలన అవి ఇప్పుడు మన మహాసముద్రాల్లో కూడా విస్తరించాయి, తెలుసా?
ఐక్యరాజ్యసమితి ప్రకారం, 80% సముద్ర కాలుష్యం భూమి ఆధారిత వ్యర్ధ పదార్ధాలు మరియు చెత్త వల్ల సంభవిస్తుంది. ప్రధానంగా, మన జలమార్గాలు టన్నుల కొద్దీ విసిరేసిన ప్లాస్టిక్‌లు మరియు పారిశ్రామిక వ్యర్థాలను సముద్రాల్లోకి తీసుకువెళతాయి. అంతే కాకుండా, ఓడలు మరియు చేపలు పట్టే పడవలు అవసరం లేని సరుకును, చేపల వలలు మరియు ఇతర వ్యర్థాలను సముద్రంలోకి పడేస్తాయి.