వింత వింత అలంకరణలు, చైతన్య పూరితమైన రంగులు, అద్భుతమైన సువాసనలు – పువ్వులు, పరాగ సంపర్కం కోసం ఎంపిక అమరికలను అందిస్తాయి. వాస్తవానికి, తేనెటీగలు, సీతాకోక చిలుకలు మరియు ఇతర పరాగసంపర్క కీటకాలు తాము సందర్శించే పువ్వులలో ప్రత్యేక ప్రాధాన్యతలను ఎంచుకుంటాయి అని అధ్యయనాలు చూపిస్తున్నాయి. అంతేకాదు మారుతున్న వాతావరణానికి అనుగుణంగా తమ అభిరుచులను కూడా సర్దుబాటు చేసుకుంటాయి.
SciQs
ఆస్ట్రేలియాలోని క్రిస్మస్ ద్వీపంలో ఎర్ర పీతల వలస కు సురక్షితమైన దారి ఏర్పరిచే పీతల వంతెన. (Photo credit; Wondrous World Images via parksaustralia.gov.au)
ఆస్ట్రేలియాలోని క్రిస్మస్ ద్వీపంలో, ప్రయాణీకులకు ‘జంతువులు దాటు దారి’ అని హెచ్చరించే సూచనలు సరిపోవు; ట్రాఫిక్ మళ్లింపు, బహిరంగ ప్రకటనలు మరియు శాశ్వత వంతెనలు అవసరం, ఎందుకంటే ద్వీప రహదారులు పీతల సముద్రం గుండా వెళ్ళాలి! ఆ ద్వీపం లో కనిపించే పీతల వలస వార్షిక కార్యక్రమం మరియు ఒక సహజ అద్భుతం.
పక్షుల రంగురంగుల ఈకలు, పులి పొడవాటి గోళ్లు, ఖడ్గమృగం యొక్క విలువైన కొమ్ము, జింక కొమ్ములు, పాంగోలిన్ (అలుగు)పొలుసులు, కాష్మీరు మేక యొక్క చక్కటి ఉన్ని, మరియు రపుంజీల్ యొక్క పొడవాటి జుట్టు – వీరి అందరిలో సమాన్యాంశం ఏమయ్యుండచ్చ్చో చెప్పగలరా?ఈ ప్రశ్న మిమ్మల్ని తల గోక్కునే లాగా లేదా గోళ్ళు కొరకడం చేసిందా? గోళ్ళ మాటకొస్తే, దానిలో కూడా ఉంది!ఇది వెన్నెముక గల జీవుల చర్మం లేదా ఎపిథీలియల్ (epithelial) కణాల్లో కనిపించే సర్వవ్యాప్తి ప్రోటీన్ – కెరాటిన్. కెరాటిన్ ప్రకృతిలో బలమైన పదార్థాల లో ఒకటి.
ప్లాస్టిక్లు మొండి చెత్త; అవి జీవఅధోకరణం (biodegrade) చెందవు. అయినప్పటికీ, మన విచక్షణారహిత మయిన ప్లాస్టిక్ వాడకం వలన అవి ఇప్పుడు మన మహాసముద్రాల్లో కూడా విస్తరించాయి, తెలుసా?
ఐక్యరాజ్యసమితి ప్రకారం, 80% సముద్ర కాలుష్యం భూమి ఆధారిత వ్యర్ధ పదార్ధాలు మరియు చెత్త వల్ల సంభవిస్తుంది. ప్రధానంగా, మన జలమార్గాలు టన్నుల కొద్దీ విసిరేసిన ప్లాస్టిక్లు మరియు పారిశ్రామిక వ్యర్థాలను సముద్రాల్లోకి తీసుకువెళతాయి. అంతే కాకుండా, ఓడలు మరియు చేపలు పట్టే పడవలు అవసరం లేని సరుకును, చేపల వలలు మరియు ఇతర వ్యర్థాలను సముద్రంలోకి పడేస్తాయి.
ఎందుకంటే ఆడ దోమలు మన రక్తంలోని మాంసకృత్తులు (ప్రోటీన్) తో వాటి గుడ్లను పోషిస్తాయి కాబట్టి.
ఈ దోమలు వాటి రక్త- ఆహారం గురించి చాలా చాదస్త పరులు; వాటి తొండాన్ని మన చర్మం లోకి పొడిచే ముందు మనలో అనేక అంశాలు పరిశీలిస్తాయి, తెలుసా?
ఈ పరిశీలన అంతరిక్ష విజ్ఞానానికి ఏమి తీసిపోదు. దోమ ల రక్త-ఆహార ఎంపిక పక్షపాతం వెనుక ఉన్న సంక్లిష్ట విధానాలను సైన్స్ ఇంకా కనుగొంటోంది.