ఐఐటీ బాంబే, ఐఐటీ మద్రాస్ మరియు ఐఐఐటి హైదరాబాద్ పరిశోధకులు కలిసి ఆంగ్లం నుండి అనేక భారతీయ భాషలకు స్పీచ్-టు-స్పీచ్  యాంత్రిక అనువాదం (SSMT) వ్యవస్థను రూపొందించారు.

ఇవి బంజరు భూములు కాదు, అభివృద్ధి చెందుతున్న జీవావరణ వ్యవస్థలు

బెంగళూరు
14 జన 2022
గ్రాఫిక్‌కు క్రెడిట్‌లు: భారతదేశంలోని ONEలు మరియు బంజరు భూముల వర్గాల పరిధిని చూపించే తులనాత్మక మ్యాప్‌లు; బ్లాక్‌బక్ - ONE యొక్క స్థానిక జాతి. మ్యాప్ మరియు బ్లాక్‌బక్ యొక్క అసలు చిత్రాలు - పేపర్ యొక్క రచయితలు

గ్రాఫిక్‌కు క్రెడిట్‌లు: భారతదేశంలోని ONEలు మరియు బంజరు భూముల వర్గాల పరిధిని చూపించే తులనాత్మక మ్యాప్‌లు; బ్లాక్‌బక్ - ONE యొక్క స్థానిక జాతి. మ్యాప్ మరియు బ్లాక్‌బక్ యొక్క అసలు చిత్రాలు - పేపర్ యొక్క రచయితలు

భారతదేశంలో ఓపెన్ నాచురల్ ఎకో సిస్టమ్స్ (ONEs) ని రక్షించడానికి తంత్ర విధానం మార్పు తీసుకురావడం తక్షణ అవసరం అని, స్వతంత్ర పరిశోధకుడు డాక్టర్ ఎమ్ డి మధుసూదన్ మరియు బెంగుళూరులోని అశోకా ట్రస్ట్ ఫర్ ఎకాలజీ అండ్ ఎన్విరాన్‌మెంట్ (ATREE) నుండి సీనియర్ ఫెలో, డాక్టర్ అబి తమీమ్ వనక్ అభిప్రాయ పడుతున్నారు.

వారు వాదించేది ఏమిటంటే, ప్రస్తుత అవగాహనానికి విరుద్ధంగా, అటవీ రహిత భూభాగాలు బంజరు లేదా బంజరు భూములు/ వృధా స్థలాలు కాకుండా, అవి అభివృద్ధి చెందుతున్న పర్యావరణ వ్యవస్థ అని. వాటి రక్షణ గురించి అవగాహన లేకపోవడం వల్ల ONE జీవవైవిధ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోంది, మరియు ఈ ప్రాంతాలకు చెందిన స్థానిక జీవ జంతు జాతులు అంతరించిపోతున్నాయి.

పరిశోధకులకు ONE అధ్యయన సమయంలో హాని కలిగించే పర్యావరణ వ్యవస్థ పరిధిని నిర్వచించడం, గుర్తించడం మరియు మ్యాపింగ్ చేయడం లో అస్పష్టత ఉండడం కనిపించింది; ఈ సమస్యలు ప్రాథమిక సవాళ్లు గా ఉన్నాయని వారు కనుగొన్నారు. కాబట్టి వారు Google Earth ఇంజిన్ యొక్క సమగ్ర భూ పరిశీలన ఉపగ్రహ చిత్రాల డేటాసెట్‌ని ఉపయోగించి అధిక రిజల్యూషన్, పారస్పరిక (ఇంటరాక్టివ్ ) ONEs మ్యాప్‌ని ఉత్పాదించే కార్యన్ని చేబట్టారు.

వారి పరిశోధన విషయాలు ప్రస్తుతం ప్రిప్రింట్‌గా అందుబాటు లో ఉన్నాయి.  వారి అధ్యయన అంతర్దృష్టులను  పొందడానికి రీశర్చ్ మాటర్స్  డాక్టర్ మధుసూదన్‌ను సంప్రదించింది. ఇవి ఇంటర్వ్యూ  సారాంశాలు.

ఓపెన్ నేచురల్ ఎకోసిస్టమ్స్ అంటే ఏమిటి మరియు వాటి మ్యాప్‌ను క్రమవృద్ధి చేయడానికి ప్రేరణ ఏమిటి ?

అడవులు అభివృద్ధి చెందుతున్న పర్యావరణ వ్యవస్థ అని మనకి తెలిసిన విషయమే, ఎందుకంటే అవి చెట్లతో కప్పబడి అనేక జాతుల వృక్షజాలం మరియు జంతుజాలానికి మద్దతు ఇస్తాయి. మరోవైపు, ఇసుకతో కూడిన ఎడారులు, గడ్డి భూములు, రాతి పంటలు, స్క్రబ్ మరియు ఉష్ణమండల పచ్చిక బయళ్ళు వంటి విభిన్న, అటవీ రహిత ప్రకృతి దృశ్యాలు చారిత్రాత్మకంగా బంజరు భూములు గా పరిగణించబడుతున్నాయి. ఎందుకంటే అవి వ్యవసాయ లేదా అటవీ భూముల వలె ఆదాయాన్ని అందించవు.

అయితే, దీనిలో కనిపించే దానికంటే ఎక్కువ  ఉంటుంది. ఈ వైవిధ్యభరితమైన భూరూపాలు, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్, బ్లాక్‌బక్స్ (కృష్ణజింకలు), ఫాక్స్ (నక్కలు), ఫ్యాన్-గొంతు బల్లులు (సీతాన తొండలు) వంటి ప్రత్యేకమైన మరియు అరుదైన జాతుల కు నిలయంగా ఉన్నాయి. ఈ విభిన్న భూభాగాలు ఓపెన్ నాచురల్ ఎకో సిస్టమ్స్ (ONEs)గా పిలువబడతాయి. అంతేకాకుండా, ఈ ప్రాంతంలో తమ పశువులు మేపుకునే కోట్లకొద్దీ పశుపాలన మరియు వ్యవసాయ పాలన దారులు  కూడా ONE మీద ఆధారపడుతున్నారు. అందువల్ల, వాటిని బంజరు భూములు గా భావించడం చాలా సంకుచిత మరియు పూర్తిగా సరికాని మార్గం.

రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ మరియు గుజరాత్‌ రాష్ట్రాలలో 300,000 చదరపు కి.మీ, అంటే దాదాపు 10% భారతదేశ భూభాగంలో ONE ఆక్రమించి ఉన్నాయి అని మా పరిశోధన కనుగొంది. ONE యొక్క మొత్తం భూభాగం లో 5% కంటే తక్కువ శాతం రక్షిత ప్రాంతం క్రిందకు పరిగణించబడి ఉన్నాయని కూడా మేము కనుగొన్నాము. ప్రస్తుతం, భారతదేశం ONE యొక్క పర్యావరణ ప్రాముఖ్యత గుర్తించలేదు, ఫలితంగా ఈ పెద్ద భూభాగాలు సమాజానికి విలువైనదేమీ అందించలేదని భావించడం వలన వాటిని బంజరు భూములు గా వర్గీకరించారు. అంతేకాకుండా, వీటిని 'అధోకరణం' లేదా 'వ్యర్థ' ప్రాంతాలుగా సూచించడం ద్వారా, సౌర మరియు పవన క్షేత్రాలు లేదా కార్బన్ సీక్వెస్ట్రేషన్ కోసం 'పునరుద్ధరణ' ప్రాజెక్టు కు వాడటం జరుగుతోంది.  పైగా ఇలాంటి పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను స్థాపించడం వంటి ‘వాతావరణ మార్పుల ఉపశమన’ కార్యకలాపాల కోసం వాటిని వాడుకోవటం సబబుగా కనిపిస్తుంది. కానీ, నిజానికి ఇటువంటి చర్యలు ONEలకు మరింత ముప్పు కలిగిస్తున్నాయి,  మరియు ONE-జీవవైవిధ్యానికి హాని వాటిల్లుతోంది అని రుజువు అవుతున్నాయి. ఫలితంగా, మనం వర్షారణ్యాల కంటే చాలా ఎక్కువ వేగంతో ONE లను కోల్పోతున్నాము, వాటి స్థానిక జాతుల మనుగడ మరియు ఆవాసాలకు హాని కలిగిస్తున్నాము.

వలసరాజ్యాల కాలం నుండి అటవీ వర్గీకరణ లో అవగాహన లేకపోవడం వలన ఈ ప్రాంతాలను వర్గీకరించడం లో పక్షపాతం ఉద్భవించింది. దీనివల్ల ఈ పర్యావరణ వ్యవస్థను నిర్వచించడం లో ఆవాసాలకు తీవ్రమైన  ముప్పు ఏర్పడింది అని మునుపటి పరిశోధనలు సూచిస్తున్నాయి.
ఉదాహరణకు, కలప- వనాల ONE లను తరచుగా అడవులుగా వర్గీకరించబడ్డాయి. అలాగే, కొన్ని బహిరంగ భూభాగాలను క్షీణించిన భూములుగా పరిగణించబడ్డాయి – పశ్చిమ కనుమలు మరియు హిమాలయాలలోని కొండ ప్రాంతాలు మరియు ఇండో-గంగా మరియు బ్రహ్మపుత్ర వరద మైదానాలు మినహాయించి.

కాబట్టి భారతదేశంలో ONE వైవిధ్యం మరియు వ్యాప్తి అర్థం చేసుకోవడంలో సహాయపడటానికి, మేము భారతదేశంలో శుష్క మరియు పాక్షిక-శుష్క ప్రాంతాలను ఆక్రమించిన ONE యొక్క విస్తృతమైన దేశవ్యాప్త హై-రిజల్యూషన్ మ్యాప్‌ను రూపొందించడం ప్రారంభించాము.

ఈ మ్యాప్ Google Earth Engine (GEE) ద్వారా అందించబడింది. ఆ ప్లాట్‌ఫారమ్‌ని ఉపయోగించడానికి ప్రేరణ ఏమిటి మరియు దాని ప్రయోజనము ఏమిటి?

మునుపటి ప్రయత్నం మీడియం రిజల్యూషన్ మోడిస్ ఇమేజరీని ఉపయోగించి భారతదేశంలో పాక్షిక-శుష్క (సెమి-ఎరిడ్) సవన్నా గడ్డి భూములను మ్యాప్ చేసింది. కానీ ఆ మ్యాప్ సాపేక్ష ముతక స్థాయి వలన సాగు లేదా బీడు భూముల నుండి గడ్డి భూములను వేరు చేయడం కష్టమయ్యింది. అయితే, GEE ప్లాట్‌ఫారమ్ నాలుగు దశాబ్దాల భూమి పరిశీలన డేటాను క్యూరేట్ చేసి ఆర్కైవ్ చేసినందున మా మ్యాప్‌ను అభివృద్ధి చేయడానికి మాకు ప్రయోజనాలు కనిపించాయి.

ముందు, ఇది  (GEE) నేటి వరకు సవరించిన, బహిరంగంగా అందుబాటులో ఉన్న ఉపగ్రహ చిత్రాల జాబితా అందిస్తుంది. రెండవది, ఇది ఉపరితల నీరు మరియు మానవ నివాసాలు వంటి విలువ-ఆధారిత నేపథ్య పొరలను కూడా అందిస్తుంది. ఉదాహరణకు, GEEలో అందుబాటులో ఉన్న డేటాసెట్‌లను ఉపయోగించి, మనకు ఇప్పటికే నీటి వనరులు అని తెలిసిన ప్రాంతాలను మాస్క్(కప్పి వేయచ్చు) చేయవచ్చు.  ద్వారా మనకి ఆసక్తి ఉన్న ప్రాంతాన్ని గుర్తించవచ్చు. మూడవది, GEE క్లౌడ్-ఆధారిత కంప్యూటింగ్ అవస్థాపన, అధునాతన అల్గారిథమ్‌లు మరియు మెషిన్ లెర్నింగ్ ఆప్షన్‌లను కూడా అందిస్తుంది. స్థానికంగా ఎటువంటి డేటాను డౌన్‌లోడ్ చేయకుండా క్లౌడ్‌లోని విస్తారమైన సమాచారాన్ని నేరుగా ప్రాసెస్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఈ సాధనాలు చేతిలో ఉన్నందున, మేము పెద్ద ప్రాదేశిక విస్తరణలో సాపేక్షంగా చక్కటి-స్థాయి నేపథ్య మ్యాప్‌ను రూపొందించగలిగాము.

ONEలను నిర్వచించిన మ్యాప్‌లోని కొన్ని కీలక అంశాలు ఏమిటి మరియు శిక్షణ డేటాసెట్‌లు ఏమిటి?

మేము దిబ్బలు, పాక్షిక-శుష్క సవన్నా గడ్డి భూములు, సవన్నా అడవులు, ఉత్తర పశ్చిమ కనుమలలోని లేటరిటిక్ పీఠభూములు, రాతి పంటలు మరియు ఇతర సహజ చెట్లు లేని బహిరంగ ప్రకృతి దృశ్యాలతో సహా చెట్లు లేని ఎడారి ప్రాంతాలు ONE గా  నిర్వచించాము. మా మ్యాప్ లో, మేము 1200 మిమీ వార్షిక వర్షపాతం మరియు 1000 మీ ఎత్తు లోపు ప్రాంతాలను కట్-ఆఫ్ గా పరిగణించాము. దీని కారణంగా, ఒండ్రు వరద మైదానాలు లేదా పశ్చిమ కనుమల పర్వత శిఖరాలు వంటి కొన్ని గడ్డి భూములు మేము వర్గీకరించిన వాటిలో చేర్చబడలేదు.

శిక్షణ డేటా అనేది నిర్దిష్ట అంశాలను గుర్తించడానికి మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్‌లకు సహాయపడే ముందే నిర్వచించబడిన సమాచారం, ఈ సందర్భంలో, నిర్దిష్ట భూ-వర్గాలు. దురదృష్టవశాత్తు, భారతదేశం యొక్క ONEs కోసం శిక్షణ డాటా సిద్ధంగా అందుబాటులో లేదు. అందువల్ల నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC) యొక్క ల్యాండ్ యూజ్ ల్యాండ్ కవర్ (LULC) మ్యాప్ మరియు వేస్ట్‌ల్యాండ్ అట్లాస్ ఆఫ్ ఇండియా వంటి బహిరంగంగా అందుబాటులో ఉన్న వివిధ డేటాసెట్‌ల నుండి సమగ్ర శిక్షణ డేటా ను సేకరించాము. మొత్తం మీద, మేము ONEలకు సంబంధించిన 1,80,000 డేటా పాయింట్‌లను మరియు ONEలు కాని 1,10,000 పాయింట్‌లను సమగ్రపరిచాము. ఈ శిక్షణ డాటా పాయింట్ల వద్ద, మేము వృక్షసంపద లేదా టోపోగ్రాఫిక్ లక్షణాలను సూచించే వివిధ రకాల ఇన్‌పుట్ బ్యాండ్‌ల నుండి విలువలను సేకరించాము.

మేము మా అధ్యయన ప్రాంతాన్ని ఎనిమిది ప్రాంతాలుగా విభజించాము. ప్రతి ప్రాంతంలో ధ్రువీకరణ కోసం ఈ డేటా యొక్క హోల్డ్-అవుట్ భిన్నాన్ని ఉంచిన తర్వాత, మేము శిక్షణ డేటాను ఉపయోగించి మోడల్‌ను అభివృద్ధి చేసాము మరియు దానిని పరీక్ష భిన్నంలో పరీక్షించాం. మేము ఈ మోడల్‌ల అవుట్‌పుట్‌ని కలిపి మరియు దాని పనితీరును ధ్రువీకరణ భిన్నానికి వ్యతిరేకంగా పరీక్షించాం. చివరగా, ముడి పిక్సెల్ డేటాపై మా వర్గీకరణను వర్తింపజేయడం కంటే, మేము దీన్ని ఇన్‌పుట్ కాంపోజిట్‌లో వర్తింపజేసాము, దీని బ్యాండ్‌లు ‘సాధారణ నాన్-ఇటరేటివ్ క్లస్టరింగ్ అల్గారిథమ్‌’ని ఉపయోగించి ప్రాదేశికంగా విభజించబడ్డాయి.

భారతదేశం అంతటా ONE లు ఎలా వ్యాప్తం చేయబడతాయి మరియు మ్యాప్ నుండి సంభావ్య అంచనా ఏమిటి?

మా మ్యాప్ ప్రకారం, భారత దేశ భూభాగంలో ONE దాదాపు 10% విజాతీయంగా విస్తరించి ఉన్నాయి. వివిధ రాష్ట్రాల భూభాగాలు  లో 0.4% (ఢిల్లీ) నుంచి 33% (రాజస్థాన్) మధ్య విస్తరించి ఉన్నాయి. మొత్తం మీద, 72.7% ONE 1-10 హెక్టార్ల పరిధిలో  ఉన్నాయి, 94% 1-100 హెక్టార్ల పరిధిలో ఉన్నాయని మేము గమనించాము; రాజస్థాన్‌లోని థార్ మరియు గుజరాత్ లోని కచ్ ప్రాంతంలో అతిపెద్ద పాచెస్ (>10000 చదరపు కి.మీ.) కనుగొనబడ్డాయి. దురదృష్టవశాత్తు, మొత్తం ONEలలో 5% మాత్రమే రక్షిత ప్రాంత నెట్‌వర్క్‌లో చేర్చబడ్డాయి.

ONE విలువైన పర్యావరణ వ్యవస్థలు అని చూపించడం మా ముఖ్య లక్ష్యం, వాటిని రక్షించడానికి మరియు వాటి స్థానాలు మరియు విస్తరణ చూపించడానికి తక్షణ విధాన మార్పులు అవసరం. భారతదేశం యొక్క ONEలను వివిధ భూభాగాలలో దేశంలోని వృక్షసంపద మరియు ల్యాండ్ కవర్ మ్యాప్‌లలో సరైన స్థానాన్ని సంపాదించుకుంటాయని మా ప్రయత్నం. మరియు వాటిని, ‘బంజరు భూములు’ లేదా ‘క్షీణించిన భూములు’ వంటి పర్యావరణపరంగా  అవమానకరమైన  పదాలతో  పరిగణించ పడకుండా ఉంటాయని మేము ఆశిస్తున్నాము.

అందువల్ల, మేము మ్యాప్‌ను సామాన్యులకు మరియు నిపుణులకు పరిశీలన కోసం తెరిచి ఉంచాము.

[పరిశోధకులు లింక్‌ని ఉపయోగించి డేటాసెట్‌ను విశ్లేషించవచ్చు, డౌన్‌లోడ్ చేయవచ్చు మరియు ఎగుమతి చేయవచ్చు, అయితే సాధారణ వినియోగదారు అప్లికేషన్‌ను ఉపయోగించి మ్యాప్‌ను చూడవచ్చు మరియు ఉపయోగించవచ్చు].


సంపాదకుని గమనిక: ఈ కథనం లో చిన్న లోపాలు సవరించబడినాయి