ఐఐటీ బాంబే, ఐఐటీ మద్రాస్ మరియు ఐఐఐటి హైదరాబాద్ పరిశోధకులు కలిసి ఆంగ్లం నుండి అనేక భారతీయ భాషలకు స్పీచ్-టు-స్పీచ్  యాంత్రిక అనువాదం (SSMT) వ్యవస్థను రూపొందించారు.

మహమ్మారి సమయంలో చిరుధాన్యాలు ఆహార అభద్రతతో పోరాడటానికి సహాయపడతాయి

Read time: 1 min
హైదరాబాద్
14 జన 2022
మహమ్మారి సమయంలో చిరుధాన్యాలు ఆహార అభద్రతతో పోరాడటానికి సహాయపడతాయి

ఇటీవలి COVID-19 మహమ్మారి వివిధ రంగాల్లో అనేక సవాళ్లను విసిరింది, మరియు, ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల మంది ఎదుర్కొంటున్న ఆకలి సంక్షోభానికి తోడయ్యింది. యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రకారం, 2019 లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 690 మిలియన్ల మంది దీర్ఘకాలిక ఆకలితో బాధపడ్డారు; అంతే కాకుండా, ఈ సంఖ్య ఇంకా పెరుగుతుంది అని భావిస్తున్నారు. పైగా, అభివృద్ధి చెందుతున్న దేశాలు వాతావరణ-ప్రభావిత వ్యవసాయ నష్టాలతోపాటు  ఆకలి మరియు వ్యాధుల కారణంగా అధికంగా నష్టపడతాయి అని సూచిస్తున్నారు. అందువల్ల, ఆహార భద్రత కలిగి ఉండడం ముఖ్యం. అంటే తగినంత మరియు పోషకమైన ఆహారాన్ని విశ్వసనీయంగా మరియు స్థిరంగా  సరఫరా చేయడం అత్యవసరం.

ఇటీవల ఒక అధ్యయనంలొ, లొ, హైదరాబాద్ విశ్వవిద్యాలయం మరియు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ జీనోమ్ రీసెర్చ్ (NIPGR), న్యూ ఢిల్లీ పరిశోధకులు ఆహార భద్రత కోసం చిరుధాన్యాల సాగును బలోపేతం చేయడానికి ఒక రోడ్‌మ్యాప్‌ను అందించారు. మిల్లెట్‌ల నాణ్యతను మెరుగుపరచడానికి బయోటెక్నాలజీ పద్ధతులను కూడా సూచించారు.  ఇవి చిరుధాన్యాల  సాగును తీవ్రతరం చేస్తాయి.  వారు ఈ పరిశోధనను  ట్రెండ్స్ ఇన్ ప్లాంట్ సైన్స్ జర్నల్‌లో ప్రచురించారు.  ఈ పరిశోధనకు NIPGR నిధులు సమకూర్చింది.

రాగులు (ఫింగర్ మిల్లెట్), కొర్రలు (ఫాక్స్‌టైల్ మిల్లెట్), సజ్జలు  (పెర్ల్ మిల్లెట్), జొన్నలు (సోర్గం), వరిగలు (ప్రోసో మిల్లెట్), ఊదలు (బార్న్‌యార్డ్ మిల్లెట్), అరికెలు (కోడో మిల్లెట్), సామలు (లిటిల్ మిల్లెట్), టెఫ్, అడవి గురుగింజలు (జాబ్స్ టియర్స్), గినియా మిల్లెట్, ఫోనియో మరియు అండు కొర్రలు (బ్రౌంటాప్ మిల్లెట్‌) లను చిన్న మిల్లెట్‌లు (చిరుధాన్యాలు) లేదా ముతక తృణధాన్యాలు అని పిలువబడతాయి. ఒకప్పుడు ఇవి ప్రపంచవ్యాప్తంగా సంప్రదాయ పంటలుగా సాగు చేయబడేవి,  కానీ ఇప్పుడు అవి వరి, గోధుమ మరియు మొక్కజొన్న వంటి వాణిజ్య పంటల పరిచయం కారణంగా కొన్ని ప్రదేశాలకే పరిమితమయ్యాయి. వీటిలో  భారతదేశం ఒక్కటి. ఈ మిల్లెట్లు వాటి ప్రాథమిక పోషక విలువలతో పాటు మెరుగైన ఆహార ప్రయోజనాలకు ప్రసిద్ధి.

చిన్న మిల్లెట్‌లు వివిధ రకాలుగా ఆహార భద్రతకు దోహదం చేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. ఉదాహరణకు, మిల్లెట్ పంటలు ఇతర తృణధాన్యాలతో పోలిస్తే తక్కువ దిగుబడిని కలిగి ఉన్నప్పటికీ, అవి మెరుగైన ఆర్థిక లాభాలను అందిస్తాయి మరియు వాతావరణ మార్పు, తెగుళ్లు మరియు వ్యాధులను బాగా తట్టుకుంటాయి. అదనంగా, మిల్లెట్ల కార్బన్ ఫుట్ ప్రింట్ (సాగు ప్రక్రియలో వాతావరణంలోకి విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్ మొత్తం) తక్కువగా ఉండవచ్చు. అందువల్ల, చిన్న మిల్లెట్స్ సాగు చేయడం వలన  వరి,  గోధుమలపై ఆధారపడటం తగ్గుతుంది మరియు ఆహార వైవిధ్యత కు సహాయపడుతుంది అని వారు చెబుతున్నారు.

పైగా మహమ్మారి సమయంలో మిల్లెట్స్ సాగు ఆహార అభద్రతను దూరం చేయడానికి దోహద పడుతుంది అని పరిశోధక బృందం చెబుతున్నారు. ఐక్యరాజ్యసమితి (యునైటెడ్ నేషన్స్), మిల్లెట్ల సాగు మరియు ప్రపంచంలొ దీర్ఘకాలిక ఆకలి ప్రదేశాలు అతివ్యాపించి ఉన్నాయని  గుర్తించింది. అందువల్ల, అటువంటి ప్రాంతాల్లో మెరుగైన వ్యవసాయ మరియు ఆర్థిక విలువలు సాధించడానికి తగిన మిల్లెట్ జాతులు, వాటి మెరుగైన లక్షణాలను గుర్తించడం అవసరం. తగిన జన్యు సాధనాలు మరియు బయోటెక్నాలజీ పద్ధతులు  ఉపయోగించడం ద్వారా ఇది చేయవచ్చు అని పరిశోధకులు చెబుతున్నారు.

భారతదేశంలో, మిల్లెట్ జెర్మ్‌ప్లాజమ్ (కొత్త మొక్కలు పెరిగే సజీవ కణజాలం) ICAR- నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్, న్యూ ఢిల్లీ మరియు ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర్ ది సెమి-ఎరిడ్ ట్రాపిక్స్, హైదరాబాద్, వంటి అనేక రిపోజిటరీల లో నిల్వ చేయబడుతుంది. ఈ పరిరక్షణ ప్రయత్నం ప్రధానంగా పరిశోధకులు, రైతుల కోసం మెరుగైన మరియు నాణ్యమైన విత్తనాలు అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టడానికి వీలు కల్పిస్తుంది. 

NIPGR లో సైంటిస్ట్ మరియు ఈ అధ్యయన రచయిత, డాక్టర్ మనోజ్ ప్రసాద్ ఇలా అంటారు: "ఈ ప్రయత్నాలతో అనేక మెరుగైన చిరుధాన్యాల విత్తనాలు రైతులకు విడుదల చేయబడ్డాయి. దీని ద్వారా రైతుల జీవనోపాధి కాపాడబడుతుంది. అంతేకాకుండా, ఇటువంటి కార్యకలాపాలవల్ల వాణిజ్య పంటల సాగు ప్రధానంగా ఉండే మన దేశంలో చిరుధాన్యల సాగు పెంపొందించ గలుగుతాము.”

ఈ పరిశోధక బృందం వివిధ శాస్త్రీయ విధానాలను ఉపయోగించి మెరుగైన మిల్లెట్ జాతులను తయారు చేయవచ్చని సూచిస్తున్నారు. అనేక జీవ శాస్త్ర అధ్యయనాల నుండి డేటా సేకరించి జన్యువులను మార్పిడి చేసే  జీనోమ్-ఎడిటింగ్ టెక్నిక్‌లను ఉపయోగించితే  మొక్క కావలసిన లక్షణాలు ప్రదర్శిస్తుంది, కావున ఇలాంటి అనుసంధానం సహాయపడుతుంది అని వారు చెబుతున్నారు. ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర సంస్థలు మిల్లెట్ వ్యవసాయాన్ని పునరుద్ధరించడం వలన భవిష్యత్తులో ప్రపంచ జనాభాలో ఆకలి మరియు పోషకాహార లోపాన్ని ఎదుర్కోవడంలో సహాయపడుతుందని పరిశోధకులు నొక్కిచెప్పారు.

ICAR యొక్క ఆల్ ఇండియా కోఆర్డినేటెడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఆన్ స్మాల్ మిల్లెట్స్ (AICRP-SM) ద్వారా ఇటువంటి పరిరక్షణ కార్యకలాపాలు చేపట్ట బడినట్లు పరిశోధకులు హైలైట్ చేశారు. డాక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ, "మిల్లెట్‌లు హార్డీ పంటలు; వాటిని సాగుచేయడానికి అతి తక్కువ  అగ్రి-ఇన్‌పుట్‌లు అవసరం కాబట్టి ప్రధాన తృణధాన్యాల కంటే మిల్లెట్స్ సాగు రైతులు ఇష్టపడే రివర్స్ ట్రెండ్ కనిపిస్తుంది," అని తెలియజేసారు. సంప్రదాయ పంటలను  సంరక్షించడం, దిగుబడిని పెంచడానికి పరిశోధనలను ప్రోత్సహించడం, మరియు పంటలపై రాబడులు పొందడం రైతులకు ఆకర్షణీయంగా ఉంటుంది, అని ఆయన చెప్పారు. అదనంగా, ఇది ఆహారంలో వైవిధ్యాన్ని నిర్ధారిస్తుంది, ఆహారం మరియు పోషక అభద్రతను పరిష్కరిస్తుంది.


సంపాదకుని గమనిక: ఈ కథనం లో చిన్న లోపాలు సవరించబడినాయి