ఐఐటీ బాంబే, ఐఐటీ మద్రాస్ మరియు ఐఐఐటి హైదరాబాద్ పరిశోధకులు కలిసి ఆంగ్లం నుండి అనేక భారతీయ భాషలకు స్పీచ్-టు-స్పీచ్  యాంత్రిక అనువాదం (SSMT) వ్యవస్థను రూపొందించారు.

స్నేహితుడా లేక శత్రువా? ఫ్యాన్-థ్రోటెడ్ బల్లులు ఘర్షణను నివారించడానికి నూతన ప్రవర్తనలను అవలంభిస్తున్నాయి అని అధ్యయనం సూచిస్తోంది

బెంగళూరు
28 జన 2022
స్నేహితుడా లేక శత్రువా? ఫ్యాన్-థ్రోటెడ్ బల్లులు  ఘర్షణను నివారించడానికి నూతన ప్రవర్తనలను అవలంభిస్తున్నాయి అని  అధ్యయనం సూచిస్తోంది

ఫ్యాన్-గొంతు బల్లులు: ఎ- సితానా లాటిసెప్స్ కు - శారదా దర్విని ( ఫోటోలు - స్వప్నిల్ పవార్)

‘కామెడీ ఆఫ్ ఎర్రర్స్’ షేక్స్పియర్ రచించిన హాస్య భరితమైన నాటకం. ఆ నాటకం,  పొరబాటు గుర్తింపు పై ఆధారించినది. కానీ ప్రకృతిలో గుర్తింపులో  పొరబాటు అంత వినోదభరితం కాక, సంభావ్య పోరాటంగా కూడా మారవచ్చు - ఈ రెండు జాతుల బల్లుల మధ్య కనిపించినట్లుగా.

బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ మరియు అమెరికాకు చెందిన  మిన్నెసోటా విశ్వవిద్యాలయం నుండి ఒక పరిశోధన బృందం, సీతాన లాటిసెప్స్ మరియు శారద దార్విని అనే రెండు జాతుల మగ బల్లుల హెచ్చరిక మరియు సంభోగ (కోర్ట్ షిప్) సంకేతాల లోని  సారూప్యత వలన హానికరమైన సంఘర్షణకు ఎలా దారితీస్తుందో పరిశోధించింది.

కనిపించే తేడాలు ఉన్నప్పటికీ, ఈ రెండు బల్లి జాతులు ఒకరినొకరు భూభాగం మరియు సాంగత్యం కు  పోటీ పడతాయి అని  వారు కనుగొన్నారు. ఈ స్పష్టమైన గందరగోళం ఈ జాతుల మగ బల్లుల  మధ్య ప్రేరేపణ, వేట మరియు కొన్నిసార్లు భౌతిక పోరాటానికి కూడా దారితీస్తుంది. తరచుగా, రెండు జాతులలో  చిన్నదైన  సితానా లాటిసెప్స్ ఈ ఘర్షణ కు బలవుతుంది.

ఈ విషాదకరమైన పరిణామాల నుంచి తనను తాను రక్షించుకోవడానికి సితానా లాటిసెప్స్ తమ సంకేత నమూనాలను (సిగ్నలింగ్ పాటర్న్స్) మార్చుకుంటూ ఉండవచ్చని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. వారు తమ అధ్యయనాన్ని ప్రొసీడింగ్స్ ఆఫ్ రాయల్ సొసైటీ బి జర్నల్‌లో ప్రచురించారు

పేరు సూచించినట్లుగా, ఫ్యాన్-గొంతు బల్లులు వాటి గొంతు కింద ఫ్యాన్ లాంటి రెక్కల (ఫ్లాప్‌) ను కలిగి ఉంటాయి, వాటిని డ్యూలాప్స్ అని పిలుస్తారు. అవి మగ బల్లులు ఆడవారిని ఆకర్షించటానికి  ఉపయోగిస్తాయి. ఆడ బల్లుల సమక్షంలో, మగ బల్లులు డ్యూ లాప్ ఫ్లాపింగ్ చేస్తాయి -  అంటే, డ్యూలాప్స్ రెక్కలను వేగంగా విస్తరించి వెనక్కి తీసుకోవడం చేస్తాయి .

మగ బల్లులు  ప్రాదేశిక పరులు. అవి ఒక రాయి లేదా బండరాయి మీద కూర్చుని, తమ ప్రదేశాలను ఇతర మగ బల్లుల నుంచి తీవ్రంగా రక్షించుకుంటాయి.  సందర్భవశమున వేరే మగ బల్లి చొరబాటుదారులను నివారించడానికి వారు అదే డ్యూలాప్ ఫ్లాపింగ్‌ను హెచ్చరిక సంకేతంగా ఉపయోగిస్తాయి.

సితానా లాటిసెప్స్ మరియు శారదా డార్విని పశ్చిమ భారతదేశంలో కనిపించే రెండు ఫ్యాన్-గొంతు బల్లి జాతులు. వీటిలో, శారదా డార్విని సాధారణంగా పశ్చిమ కనుమల దిగువన నివసిస్తుంది, అయితే సీతానా లాటిసెప్స్ దక్కన్ పీఠభూమి ప్రాంతం అంతా విస్తృతంగా కనిపిస్తుంది. రెండు ప్రాంతాలు కలిసే ప్రదేశాలలో, ఈ రెండు జాతులు ఒకదానితో ఒకటి అతివ్యాప్తి అవుతూ కనిపిస్తాయి.

అతివ్యాప్తించిన  ప్రాంతాలలో, ఈ జాతుల మగ బల్లులు, తరచూ ఒకరితో ఒకరు గొడవ పడుతూ ఉంటాయి.  శ్రీ అమోద్ జాంబ్రే,  అధ్యయనం యొక్క రచయిత ఇలా చెప్పారు: “ ఈ రెండు జాతుల ఆడ బల్లులు చూడటానికి ఒకే విధంగా ఉంటాయి, మరియు మగ బల్లుల డ్యూలాప్ ఫ్లాప్పింగ్  లో కూడా సారూప్యత ఉండటం వలన,  రెండు జాతుల మగవారికి వారి ఆడ బల్లి ని గుర్తించడం మరియు స్వంత లేదా ఇతర జాతుల ప్రత్యర్థుల మధ్య తేడాను గుర్తించడం సవాలుగా ఉంటుంది.”

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, శారదా డార్విని కి మూడు-రంగుల డ్యూ లాప్ ఉంటుంది, సీతానా లాటిసెప్స్ యొక్క డ్యూలాప్ సాదా తెల్లగా ఉంటుంది. వాస్తవానికి, రెండు వేర్వేరు జాతుల మధ్య సంభోగం భౌతికంగా అనుకూలించదు, మరియు సాంగత్యం సమయంలో చుట్టూ ఇతర జాతులకు చెందిన మగ బల్లులు ఉండటం వల్ల ఎటువంటి ప్రమాదం లేదు. కానీ, ఆ బల్లుల కు ఈ విషయం  ఇంకా తెలియదు! కాబట్టి , ఈ బల్లులు ఒకరినొకరు ప్రత్యర్థులుగా అనుమానించి గొడవ పడుతూ ఉంటాయి. 

"రంగులో ఇంత పెద్ద వ్యత్యాసాలు జాతుల మధ్య సంఘర్షణ తగ్గించడానికి సిద్ధాంతపరంగా సహాయపడతాయి, కానీ ఈ బల్లుల లో, అవి సంఘర్షణను తగ్గించడంలో సహాయపడు తున్నట్లు అనిపించడం లేదు. ఇది ఏందుకో మాకు ఖచ్చితంగా తెలియదు కానీ ఈ ప్రవర్తన చాలా ఆసక్తికరంగా ఉంది,” అని శ్రీ జాంబ్రే చెప్పారు.

తప్పుగా గుర్తించిన కారణంగా సంభవించే శారీరక పోరాటం చిన్నదిగా ఉన్న సితానా లాటిసెప్స్‌ కు ముఖ్యంగా ప్రమాదకరంగా మారుతుంది.

ఇలాంటి తగాదాలు నివారించడానికి, సితానా లాటిసెప్స్ వాటి సిగ్నలింగ్ ప్రవర్తనలను మార్చుకుంటూ ఉండవచ్చని  పరిశోధకులు ఊహిస్తున్నారు. వారి సిద్ధాంతాన్ని పరీక్షించడానికి, వారు పశ్చిమ కనుమల మూడు ప్రదేశాల నుండి బల్లులను సేకరించారు: ఒకటి శారదా డార్విని మాత్రమే నివసించేది, రెండవది సీతానా లాటిసెప్స్ మాత్రమే, మరియు మూడవ ప్రదేశంలో, రెండు జాతులు కలిసి వృద్ధి చెందేది (~15 కి మీ వ్యాప్తం లో) మరియు ఈ ప్రదేశాలు శుష్క గడ్డి భూములు నివాసాలు కలిగి ఉన్నవి.

ఈ మూడు ప్రదేశాల్లో, వారు మగ మరియు ఆడ బల్లుల సాంద్రతతొ పాటు,  మగ డ్యూలాప్‌  ప్రవర్తన పరిమాణాలతో సహా వారి పదనిర్మాణ డేటాను కూడా రికార్డ్ చేశారు. ఇంకా ఆ మగ బల్లులు తోటి మగ బల్లుల పట్ల దౌర్జన్య పూర్వక వ్యవహారం మరియు ఆడ బల్లుల పట్ల అనురంజన నడవడిక లను పరిశీలించారు.

కేవలం సితానా లటిసెప్స్ నివసించే ప్రాంతం లో కంటే రెండు బల్లి జాతులు కలిసి నివసిస్తున్న  ప్రాంతంలో, సీతానా లాటిసెప్స్ యొక్క డ్యూలాప్ ఫ్లాప్పింగ్ తరచుదనం మారిందని వారి పరిశీలనలు సూచించాయి. “శారదా దార్వినితో సహ-సంభవించే సితానా లాటిసెప్స్ చిన్న డ్యూలాప్‌లను కలిగి ఉంటాయి మరియు డ్యూలాప్ ఫ్లాగింగ్ తక్కువ తరచుగా కలిగి ఉంటాయి. అందువల్ల వారు ఉపసర్పణ మరియు దౌర్జన్య పూర్వక ప్రదర్శనలు సాపేక్షంగా తక్కువ తీవ్రత కలిగి ఉంటాయి,” అని  శ్రీ జాంబ్రే వివరించారు.

అయినప్పటికీ, వివిక్త ప్రాంతాల మగ సితానా లాటిసెప్స్ లో ఎటువంటి గమనించదగిన మార్పులు పరిశోధకులు గమనించలేదు. ఇతర జాతుల ఉనికి మరియు దాని ఫలితంగా ఏర్పడిన పోటీ, చిన్న బల్లుల లో వాటి ప్రస్తుత సంకేతవ్యవస్థ నమూనా మార్చడానికి నడిపించిందని  వారు చెప్పారు.

ఈ సంకేతాలు తగినంతగా విభేదిస్తే, శారదా దార్విని సీతానా లాటిసెప్స్‌ను వేరే జాతికి చెందినదిగా అర్థం చేసుకుని, దానిని పట్టించుకో పోవచ్చు. అలాగే, సంకేతాలు ఈ మార్పులు మగ బల్లుల లో స్థాపించబడతాయా, మరియు ఆ లక్షణాలను ఆడ బల్లులు   ఎంతవరకు అంగీకరిస్తారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది, ఇది ఇంకా అన్వేషించవలసి ఉంది  అని పరిశోధకులు తెలియజేసారు.

హానికరమైన పోరాటాలను నివారించడం ద్వారా, ఒక జాతి భిన్నంగా అభివృద్ధి చెందుతుందని పరిశోధకులు అంటున్నారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే, ప్రవర్తన మరొక జాతి తో కలిసి నివసించే ప్రాంతంలో మాత్రమే మారుతుంది, ఒంటరిగా జీవించినప్పుడు కాదు. ఇటువంటి ప్రవర్తన మార్పులు మన చుట్టూ ఉన్న జీవ రూపాల లో వైవిధ్యం ఉద్భవించే మార్గాలలో ఒకటి కావచ్చు.

Telugu