ఐఐటీ బాంబే, ఐఐటీ మద్రాస్ మరియు ఐఐఐటి హైదరాబాద్ పరిశోధకులు కలిసి ఆంగ్లం నుండి అనేక భారతీయ భాషలకు స్పీచ్-టు-స్పీచ్  యాంత్రిక అనువాదం (SSMT) వ్యవస్థను రూపొందించారు.

కెరాటిన్: ప్రకృతి యొక్క అద్భుతమైన ప్రోటీన్

Read time: 1 min 4 ఫిబ్రవరి, 2022 - 18:36

పక్షుల రంగురంగుల ఈకలు, పులి పొడవాటి గోళ్లు, ఖడ్గమృగం యొక్క విలువైన కొమ్ము, జింక కొమ్ములు, పాంగోలిన్ (అలుగు)పొలుసులు, కాష్మీరు మేక యొక్క చక్కటి ఉన్ని, మరియు రపుంజీల్ యొక్క పొడవాటి జుట్టు – వీరి అందరిలో సమాన్యాంశం ఏమయ్యుండచ్చ్చో చెప్పగలరా?ఈ ప్రశ్న మిమ్మల్ని తల గోక్కునే లాగా లేదా గోళ్ళు కొరకడం చేసిందా? గోళ్ళ మాటకొస్తే, దానిలో కూడా ఉంది!ఇది వెన్నెముక గల జీవుల చర్మం లేదా ఎపిథీలియల్ (epithelial) కణాల్లో కనిపించే సర్వవ్యాప్తి ప్రోటీన్ – కెరాటిన్. కెరాటిన్ ప్రకృతిలో బలమైన పదార్థాల లో ఒకటి. కెరాటిన్ యొక్క కాఠిన్యాన్ని పోలి ఉండే ఏకైక ఇతర కణజాలం కైటిన్ (chitin), ఇది కీటకాలు మరియు షెల్ఫిష్ (గుల్ల పురుగు) యొక్క బాహ్య అస్థిపంజరం లో కనిపించే పదార్థం.

నిర్మాణాత్మకంగా, కెరాటిన్ పీచు పదార్థం మరియు సల్ఫర్ (గంధకం) - కలిగిన అమీనో ఆమ్లం సిస్టీన్ (cysteine) యొక్క అధిక సాంద్రతను కలిగి ఉంటుంది.  జుట్టును కాల్చినప్పుడు ఈ గంధకం వలన ఘాటైన వాసన వస్తుంది. అణువుల లోపల మరియు వాటి మధ్య ఉండే గంధక రసాయన బంధాలు మానవ జుట్టు లేదా ఉన్నిలో కనిపించే పటుత్వము మరియు స్థితిస్థాపక గుణము ను అందిస్తాయి.

కెరాటిన్ రెండు రూపాల్లో ఉంటుంది – ఆల్ఫా (α) -కెరాటిన్ మరియు బీటా (β) -కెరాటిన్. మొదటిది చర్మం, వెంట్రుకలు మరియు గొర్రెల ఉన్ని వంటి మృదు కణజాలాలలో కనిపిస్తుంది, రెండోది కొమ్ములు, ఈకలు, పంజాలు లేదా గిట్టలు వంటి గట్టి కణజాలాలలో ఉంటుంది. కెరాటిన్ కడుపులో జీర్ణ ఆమ్లాలకు కూడా నిరోధకతను కలిగి ఉంటుంది, అందువల్ల, బొచ్చు లేదా వెంట్రుకలు తినే మాంసాహారులు దానిని  వెంట్రుక ఉండ (హెయిర్‌బాల్‌)లుగా విసిరివేస్తాయి.  ఖడ్గమృగం కొమ్ము, కేవలం కెరాటిన్ మాత్రమే అయినప్పటికీ సాంప్రదాయ చైనీస్ వైద్యంలో ఔషధ విలువలు కలిగి ఉంది అని చెప్పబడింది, ఇది కూడా ఉన్నదున్నట్టుగా శరీరమునుండి విసర్జించబడుతుంది!

కెరాటిన్ అనేది మన శరీరానికి అనుకూలమైన మరియు సహజమైన ప్రోటీన్, పైగా సేంద్రియ మండలములు (ఎంజైమ్‌లు) దానిని క్షీణింపజేయవు కాబట్టి, శాస్త్రవేత్తలు దాని అనువర్తనాలను బయోమెటీరియల్స్‌గా అన్వేషిస్తున్నారు. ల్యాబ్‌లో కణాలు మరియు పునరుత్పత్తి కణజాలాలను పెంచడానికి మరియు సమయోచిత క్రీమ్‌లు మరియు సౌందర్య ఉపయోగాలలో గాయాన్ని నయం చేసే ఏజెంట్‌ల కోసం శాస్త్రవేత్త లు  త్రిమితీయ పరంజా (three-dimensional scaffolds) న్ని నిర్మించడానికి మానవ జుట్టు నుండి కెరాటిన్‌ను ఉపయోగిస్తారు. ఉన్ని మరియు జుట్టు వంటి కెరాటిన్ నిర్మాణం యొక్క స్థితిస్థాపకత మరియు బలాన్ని సూపర్-స్ట్రాంగ్ ఫైబర్‌లు మరియు 'స్మార్ట్' ఫాబ్రిక్‌లను తయారు చేయడానికి ఉపయోగిస్తారు, ఇవి వాటి ఆకృతిని నిలుపుకుంటాయి.

జుట్టులో కెరాటిన్ యొక్క విశ్లేషణ పురాతన మానవులు మరియు జంతువుల ఆహారాల ను కూడా వెల్లడిస్తుంది మరియు మరణానికి గల కారణాలను గుర్తించడానికి ఫోరెన్సిక్ సైన్స్‌లో ఉపయోగించబడుతుంది. మన కురుల నిధి లోని ప్రొటీన్‌ ఇన్ని అద్భుతాలను చేయగలదని ఎవరికి తెలుసు!