ఐఐటీ బాంబే, ఐఐటీ మద్రాస్ మరియు ఐఐఐటి హైదరాబాద్ పరిశోధకులు కలిసి ఆంగ్లం నుండి అనేక భారతీయ భాషలకు స్పీచ్-టు-స్పీచ్  యాంత్రిక అనువాదం (SSMT) వ్యవస్థను రూపొందించారు.

దోమ కాటుకు మీరు ఎలా ఎంపికయ్యారు?

Read time: 1 min 14 జనవరి, 2022 - 07:00

ఎందుకంటే ఆడ దోమలు మన రక్తంలోని మాంసకృత్తులు (ప్రోటీన్) తో వాటి గుడ్లను పోషిస్తాయి కాబట్టి.

ఈ దోమలు వాటి రక్త- ఆహారం గురించి చాలా చాదస్త పరులు;  వాటి తొండాన్ని మన చర్మం లోకి పొడిచే ముందు మనలో అనేక అంశాలు పరిశీలిస్తాయి, తెలుసా?

ఈ పరిశీలన అంతరిక్ష విజ్ఞానానికి ఏమి తీసిపోదు. దోమ ల రక్త-ఆహార ఎంపిక పక్షపాతం వెనుక ఉన్న సంక్లిష్ట విధానాలను సైన్స్ ఇంకా కనుగొంటోంది.

ఆడ దోమలు 'యాదృచ్చిక గుర్తింపు' లేదా ‘బహుళ ఘ్రాణ శక్తి’ (వాసన మార్గాల) ను ఉపయోగిస్తాయి, మరియు వాటి లక్ష్యాన్ని ఎంచుకోవడానికి ఆ సంకేతాలను సరిచూచుకుంటాయి అని పరిశోధనలు చెబుతున్నాయి.

వాటి యాంటెన్నా (తరంగ గ్రాహకం) లో వాసన గ్రాహకాలు కలిగి ఉండే మాక్సిలరీ పాల్ప్ అనే ప్రత్యేక అవయవం కలిగి ఉంటుంది. Ir8a అని పిలువబడే ఒక గ్రాహకం కార్బన్ డయాక్సైడ్ (బొగ్గుపులుసు వాయువు) కు ప్రత్యేకంగా స్పందిస్తుంది. దోమలు, ఈ గ్రాహకాల తో 30 అడుగుల దూరం నుండి మనుషుల వాసన లో ఆ వాయువును పసిగట్టగలవు.

గర్భిణీ స్త్రీలు, అధిక బరువు ఉన్న వ్యక్తులు మరియు మద్యం సేవించే వారు ఎక్కువ కార్బన్ డై ఆక్సైడ్‌ను వదిలివేయటంవలన, దోమల కాటుకు మరింత గురవుతారు.

మరియు, Ir8a చెమటలోని లాక్టిక్ యాసిడ్, యూరిక్ యాసిడ్, అమ్మోనియా వంటి అస్థిర ఆమ్లాలకు కూడా స్పందిస్తుంది. దోమ మన చర్మంపై వాలగానే దాని పాదాలతో చెమటను రుచి చూడటం ప్రారంభిస్తుంది. కాబట్టి, మనం ఎంత చెమటతో ఉంటామో, అంత ఎక్కువగా మనం దోమలను ఆకర్షిస్తాం. ఇంకా, దోమలు వెచ్చని శరీర ఉష్ణోగ్రతలను ఇష్టపడతాయట.

జన్యుపరమైన కారకాల ఆధారంగా, మనలో దాదాపు 85% మంది చర్మంలో ప్రత్యేక రసాయనాలను స్రవిస్తారు. ఇవి రక్తం యొక్క యాంటిజెన్ లేదా రక్తం యొక్క రకాన్ని వెల్లడిస్తాయి -- అంటే, A, B, AB లేదా O గ్రూప్ ల వ్యత్యాసాన్ని తెలియజేస్తుంది.

ఒక అధ్యయనం ప్రకారం, దోమలు ఈ సంకేతాలను గ్రహిస్తాయి అని తెలుసుకున్నారు. అంటే, దోమలు, మనలొ ఎవరు ఈ రసాయనాలను స్రవిస్తారో లేదొ కనిపెట్టగలవు. సాధారణంగా దోమలు, రసాయనాలు స్రవించని వారి కంటే ఈ స్రావాలు కలిగి ఉన్న వారి పట్ల ఆకర్షితులవుతాయి. అదనంగా, నియంత్రిత-సమూహ ప్రయోగంలో, దోమలు O- గ్రూప్ రక్తాన్ని తమ భోజనానికి విలువైనవిగా గుర్తిస్తాయి అని పరిశోధకులు గమనించారు.

అంతేకాకుండా, మన చర్మంపై ఉండే కొన్ని రకాల బ్యాక్టీరియా దోమలను ఆకర్షిస్తాయి (ఈ కారణంగా, సహజంగా చీలమండలు మరియు పాదాల చుట్టూ అధికంగా బ్యాక్టీరియా ఉండటం వలన, మనం ఆ ప్రాంతాల్లో అధిక దోమకాటుకు గురవుతాము).

చివరిగా, దోమలు తమ ఎరను గుర్తించడానికి దృష్టి శక్తి ని కూడా మిళితం చేస్తాయి. అవి ముదురు రంగు షేడ్స్‌లో ఉన్న లక్ష్యాలకు మరింత ఆకర్షితులవుతాయి  అని సూచింపబడుతోంది.