ఐఐటీ బాంబే, ఐఐటీ మద్రాస్ మరియు ఐఐఐటి హైదరాబాద్ పరిశోధకులు కలిసి ఆంగ్లం నుండి అనేక భారతీయ భాషలకు స్పీచ్-టు-స్పీచ్  యాంత్రిక అనువాదం (SSMT) వ్యవస్థను రూపొందించారు.

ఎర్ర పీతల ఘనమైన వలస

Read time: 1 min 26 ఫిబ్రవరి, 2022 - 14:52

ఆస్ట్రేలియాలోని క్రిస్మస్ ద్వీపంలో ఎర్ర పీతల వలస కు సురక్షితమైన దారి ఏర్పరిచే  పీతల వంతెన.  (Photo credit; Wondrous World Images via parksaustralia.gov.au)

ఆస్ట్రేలియాలోని క్రిస్మస్ ద్వీపంలో, ప్రయాణీకులకు ‘జంతువులు దాటు దారి’ అని హెచ్చరించే సూచనలు సరిపోవు; ట్రాఫిక్ మళ్లింపు, బహిరంగ ప్రకటనలు మరియు శాశ్వత వంతెనలు అవసరం, ఎందుకంటే ద్వీప రహదారులు  పీతల సముద్రం గుండా వెళ్ళాలి! ఆ ద్వీపం లో కనిపించే పీతల వలస వార్షిక కార్యక్రమం మరియు ఒక సహజ అద్భుతం.

ఈ ద్వీపం అద్భుతమైన ఎర్ర పీతల (రెడ్ ల్యాండ్ క్రాబ్ - Gecarcoidea natalis) కు ఏకైక నిలయం. లక్షలాది గుల్ల గల పీతలు ఒంటరిగా, పిరికిగా ఉండే ప్రాదేశిక పరులు. అవి ఎండిన ఆకులు, బొరియలు, రాతి పగుళ్లు మరియు తోటల్లో నివసిస్తాయి. అవి  విత్తనాలు, ఆకులు మరియు చనిపోయిన జంతువుల ను ఆహారంగా తీసుకుని, ద్వీపం యొక్క పర్యావరణ సమతుల్యతను నిర్వహిస్తాయి.

ప్రతి నవంబర్ లో, వర్షాలు ప్రారంభమైనప్పుడు, మగ పీతలు సముద్రం వైపు క్లిష్టమైన ప్రయాణాన్ని ప్రారంభించేందుకు వాటి రహస్య గుడారాల నుండి బయటకు వస్తాయి. తర్వాత ఆడ పీతలు ఈ సామూహిక మహాప్రవాహం లో చేరతాయి. ఇది ఏటా జరిగే అద్భుతమైన నియంత్రణతో చంద్ర లయను అనుసరించి  సమకాలీకరించబడిన సంఘటన.

ఈ పీతలు నగర రహదారులు దాటి, తీరానికి చేరుకోవడానికి 7-9 రోజులు పడుతుంది. దారిలో, వాతావరణం అనుకూలిస్తే, అవి ఆగి విహరిస్తాయి. మొట్టమొదట ఒడ్డుకు చేరేది మగ పీతలు. అవి మొదట నీటిలో మునక వేసిన తర్వాత, బొరియలు తవ్వడంలో నిమగ్నులవుతాయి.  ఆడ పీతలు ఒడ్డుకు చేరగానే, స్నానం చేసి, సంభోగం కోసం బొరియలకు వెళ్తాయి. సంభోగం తర్వాత, మగ పీతలు నీటిలో మళ్లీ మునక వేసి తిరుగు ప్రయాణానికి బయలుదేరుతాయి.

ఆడ పీతలు బొరియలలోనే ఉంటాయి. వాటి పొట్ట సంచి లో సుమారు 100000 గుడ్లు పొదుగుతాయి.  క్షీణదశ లో చంద్రుని యొక్క మూడో త్రైమాసికం కోసం 2-3 వారాలు వేచి ఉంటాయి. అప్పుడు, తెల్లవారకముందే, అవి బొరియలలో నుంచి బయటకు వచ్చి, క్రిందకు దిగి, తక్కువ ఎత్తు అలలు ఉన్నప్పుడు, గుమిగూడి గుడ్లను నీటిలోకి వదులుతాయి. తర్వాత, ఆడ పీతలు త్వరగా ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకుని భూమి మీద ఉన్న వాటి స్థానానికి తిరిగి వలస సాగిస్తాయి.

ఇంతలో, గుడ్లు నీటిలో వెంటనే పొదుగుతాయి మరియు కీట స్థితి (లార్వా) గా ఒక నెల పాటు ఉంటాయి. అవి రొయ్యల లాంటి దశకు చేరుకున్నప్పుడు, ఈదుకుంటూ ఒడ్డుకు చేరి 5-మి.మీ సైజు పిల్ల పీతలు గా రూపాంతరం చెందుతాయి. పిల్లలు సమయాన్ని ఏమాత్రం వృధా చేయకుండా వెంటనే భూమి వైపు ప్రమాదకరమైన ప్రయాణం ప్రారంభిస్తాయి! భూమి మీద అవి  గుహలను నిర్మించుకుని తరువాతి 3-4 సంవత్సరాల వరకు పెద్దవిగా పెరిగే వరకు కనబడకుండా ఉండి రహస్యంగా జీవిస్తాయి.

ఎర్ర పీత పిల్ల (photo by Chris Bray via parksaustralia.gov.au)

జనక పీతలు తమ సంతానం యొక్క మనుగడ కోసం అపారమైన ప్రయత్నాలు, నిర్దిష్టమయిన సమయపాలన మరియు ప్రాణాంతక విన్యాసాలు చేసినప్పటికీ, కీట స్థితి లో ఉన్న పీత పిల్లలు సముద్రంలో ఎక్కువగా వేటాడబడతాయి. అయినప్పటికీ, కొన్ని సంవత్సరాలకు ఒకసారి, ఒక పెద్ద తడవ పీతలు  జీవించి, మనుగడ సాగిస్తూ, తద్వారా ద్వీపంలో వారి జనాభా ల సమతుల్యత  వస్తుంది.